పేదవాడు దగ్గర నుంచి ధనవంతుడు వరకు ప్రతి ఒక్కరు కాస్త రిలీఫ్ అయ్యేందకు ఒక కప్పు టీని సిప్ చేయలనుకుంటారు. పైగా కాస్త తలనొప్పిగా ఉన్న లేదా పని ఒత్తిడితో అలిసినట్లు అనిపించినప్పుడు కాస్త టీ తీసుకుంటే గానీ ఒక పట్టాన కుదుటపడలేం అన్నంతగా ఫీలవుతారు చాలామంది. అయితే మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లా వాసులు మాత్రం టీ తోపాటుగా టీ కప్పులను కూడా తినేస్తారట. పైగా ఇలా చేయడం వల్ల చెత్త సమస్య కూడా ఉండదంటున్నారు.
(చదవండి: 60 మిలియన్లకు కోవిడ్ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!)
అసలు విషయంలోకెళ్తే...షాహ్‌దోల్ జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లోని మోడల్ రోడ్డు పక్కన టీ అమ్ముకునే వ్యక్తి ఒక సరికొత్త టీని కనుగొన్నాడు. ఇక్కడ చక్కటి టీతోపాటు కప్పుని కూడా తినేసేలా తయారు చేశాడు. దీంతో అక్కడి ప్రజలు చక్కగా టీని ఆస్వాదిస్తూ కప్పుని కూడా తినేస్తారట. అయితే అతను ఆ కప్పు గాజు లేదా సిరామిక్ లేదా ప్లాస్టిక్‌తో తయారు చేసింది కాదు. ఆ టీ కప్పుని బిస్కెట్ పొరలతో తయారు చేస్తారు. పైగా ఆ కప్పు టీ ధర కేవలం రూ 20 మాత్రమే. అయితే ఆ షాపు యజమాని తమ షాపులో ఒక కప్పు టీతోపాటు కప్పు కూడా తినేయడమే ప్రత్యేకత అని చెబుతుంటాడు. ఏదిఏమైన ఇది ఒకరకంగా పర్యావరణాన్ని సంరక్షించుకునేలా చెత్త రహితంగా ఉంచడంలో ఉపకరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment