సాక్షి, న్యూఢిల్లీ: పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వేరియంట్లను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక, భారత్‌లో కూడా చైనాలో వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ బీఎఫ్-7 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇక, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. కీలక సూచనలు చేశారు. రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు పెంచాలి. కరోనా కేసుల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలి. ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు పెంచాలి. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలి. ఆసుపత్రుల్లో బెడ్లు, మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలి. ప్రతీ ఒక్కరూ బూస్టర్ డోసులు తీసుకోవాలి. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలి. ప్రజలందరూ పూర్తి అప్రమత్తతో ఉండాలి. ఫ్రంట్‌లైన్ కార్మికులు, కరోనా యోధుల నిస్వార్థ సేవకు ప్రశంశలు కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment