
సాక్షి, చెన్నై: ఏఐఏడిఎంకే సీనియర్ నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సతీమణి విజయలక్ష్మి (63) కన్నుమూశారు. గత రెండు వారాలుగా చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం డిశ్చార్జ్ కావల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. సీఎం స్టాలిన్, అన్నాడీఎంకే పార్టీ నేతలు, ఇతర రాజకీయ ప్రముఖులు పన్నీరు సెల‍్వంకు తమ సానుభూతి ప్రకటించారు.
పన్నీరుసెల్వంను కలిసి ఓదారుస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్
విజయలక్ష్మి మృతి పట్ల సంతాపం తెలిపిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రి దురైమురుగన్, బహిష్కృత అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళ ఇతర నేతలు ఆసుపత్రిలో పన్నీరు సెల్వంను కలిసి ఓదార్చారు. మరోవైపు సెల‍్వం స్వగ్రామం పెరియాకులమ్‌లో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా సెల్వం, విజయ లక్ష్మి దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment