MK. Stalin
-
చెన్నై జలమయం
చెన్నై/అమరావతి/సాక్షి నెట్వర్క్ : కుండపోత వానలతో చెన్నై నగరం చిగురుటాకులా వణుకుతోంది. నదులు, వాగులు.. వంకలు పొంగి పొర్లుతున్నాయి. 50కి పైగా జలాశయాలు, వందలాది చెరువుల నుంచి వరద నీటిని విడుదల చేశారు. నగరం చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. రిజర్వాయర్ల నుంచి భారీ పరిమాణంలో నీరు విడుదలవుతుండటంతో 2015 నాటి భయానక అనుభవాలు గుర్తుకొచ్చి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. (చెంబరం బాక్కం నుంచి నీళ్లు హఠాత్తుగా విడుదల చేయడం వల్ల ఆరేళ్ల క్రితం చెన్నై నగరం దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది.) శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నైకి తాగునీరు అందించే చెంబరం బాక్కం, పూండి, పుళల్ రిజర్వాయర్ల నుంచి వరద నీటి విడుదలతో రవాణా సౌకర్యాలు స్తంభించాయి. రైళ్ల రాకపోకలపైనా ప్రభావం పడింది. విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఉత్తర, దక్షిణ చెన్నై పరిధిలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చెన్నైలోని సబర్బన్ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం వరకు 23 సెం.మీ వర్షం కురవడంతో నగరంలో రహదారులు చెరువులుగా మారాయి. దీంతో పలు ప్రాంతాల్లో రవాణా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న తమిళనాడు ప్రభుత్వం.. వరద ముప్పు ఉందన్న హెచ్చరికలు జారీ చేసి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని ప్రత్యేక శిబిరాలకు తరలిస్తోంది. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ఇరాయి అంబు, ఇతర అధికారులతో కలిసి వరద ప్రాంతాలకు వెళ్లి స్వయంగా పరిస్థితుల్ని సమీక్షించారు. ప్రజలెవరూ ఇబ్బందులు పడకుండా సహాయ కార్యక్రమాలు అందించాలంటూ అధికారుల్ని ఆదేశించారు. స్టాలిన్ విజ్ఞప్తి మేరకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) కూడా రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. చెన్నైతో పాటు తిరువళ్లూర్, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో వచ్చే రెండు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా తమిళనాడు, పాండిచ్చేరిలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. సోమవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మరో మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో దాదాపు చెరువులన్నీ నిండిపోగా.. తూర్పు మండలాల్లో 75 శాతం చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. వీటిలో 25 శాతం చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. చిత్తూరు, తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో కలెక్టర్ హరినారాయణన్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కేవీబీపురం మండలం బ్రాహ్మణపల్లి – కాళంగి మధ్య కాలువ గట్టు కొట్టుకుపోవడంతో 8 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పిచ్చాటూరు మండలం ఆరణీయార్ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తి 1,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కేవీబీ పురం మండల పరిధిలోని కాళంగి రిజర్వాయర్‌కు అంచనాకు మించి భారీగా వరద నీరు చేరడంతో 10 గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. తిరుమలకు తప్పిన నీటి కష్టాలు తిరుమలలోని గోగర్భం, పాప వినాశనం డ్యాంలు పూర్తి స్థాయిలో నిండటంతో నీటిని కిందికి విడిచిపెట్టారు. ఆకాశగంగ, కుమారధార ప్రాజెక్టులు కూడా నిండాయి. తద్వారా ఏడాది పాటు తిరుమలకు నీటి కష్టాలు ఉండవు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని మల్లిమడుగు, సదాశికోన రిజర్వాయర్‌కు వరద నీరు చేరుతోంది. చంద్రగిరి పరిధిలోని కళ్యాణీ డ్యాం పూర్తి స్థాయిలో నిండేందుకు మరో 11 అడుగులు మాత్రమే మిగిలి ఉంది. నిమ్మనపల్లి పరిధిలోని బహుదా ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు చేరింది. పలమనేరు పరిధిలోని కౌడిన్య, కైగల్, ఎరిగేరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కాలువపల్లి సమీపంలోని వైఎస్సార్ జలాశయం పూర్తిగా నిండింది. నెల్లూరును ముంచెత్తిన వర్షాలు నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాలు జలమయయ్యాయి. దీంతో అధికారులు రెయిన్ అలెర్ట్ ప్రకటించారు. ఆదివారం ఉదయానికి 62.7 మి.మీ వర్షం కురిసింది. అత్యధికంగా తడలో 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సూళ్లూరుపేట సమీపంలో కోటపోలూరు పుచ్చకాల్వపై ఇసుక తీసుకు వెళ్తున్న ఎద్దులబండి వరద నీటిలో కొట్టుకుపోయింది. కాడికి ఎద్దులు కట్టి ఉండడంతో నీటిలో నుండి బయటకు రాలేకపోయాయి. వాగులు, వంకలు పొర్లుతున్నాయి. ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి, రామలింగాపురం అండర్ బ్రిడ్జి, మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జిలో నీరు చేరడంతో రాకపోకలు ఆగిపోయాయి. మన్సూర్‌నగర్, జనార్ధన్‌రెడ్డి కాలనీ, కళ్యాణ్‌నగర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. సముద్రతీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేట సామగ్రిని భధ్ర పరుచుకొన్నారు. వైఎస్సార్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయి. అల్లకల్లోలంగా పాలకాయతిప్ప బీచ్ కోడూరు (అవనిగడ్డ): కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాలకాయతిప్ప బీచ్ వద్ద తీవ్ర అలజడి నెలకొంది. సాగరంలో సుడిగుండాల ప్రభావం అధికంగా ఉండడంతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రపు నీరు సుమారు మూడు కిలోమీటర్ల మేరకు ముందుకు చొచ్చుకొచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సముద్రపు నీరు పాలకాయతిప్ప కరకట్టను తాకడంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమావాస్య పోటుకు అల్పపీడనం తోడవ్వడంతో అలల ఉధృతి అధికంగా ఉందని అధికారులు తెలిపారు. అలల ధాటికి సముద్ర రహదారి భారీగా కోతకు గురైంది. సుమారు 25 మీటర్ల మేర రహదారి మొత్తం కొట్టుకుపోయి, కొండరాళ్లు బయటపడ్డాయి. పర్యాటకులు విశ్రాంతి తీసుకొనేందుకు ఏర్పాటు చేసిన బల్లలు సైతం సాగరంలో కలిసి పోయాయి. దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలపై కొనసాగుతోంది. అదేవిధంగా ఆగ్నేయ బంగాళాఖాతం సుమత్రా తీర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో 9వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది మరింత బలపడి తీవ్ర అల్ప పీడనంగా మారి.. రాగల 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు తీరంవైపు ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించారు. 10, 11 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. తీరం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులెవ్వరూ మంగళవారం నుంచి 12వ తేదీ వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో గంధవరంలో 11 సెం.మీ. విడవలూరులో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. అండగా ఉంటాం : ప్రధాని మోదీ న్యూఢిల్లీ: తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, కుంభవృష్టితో చైన్నై జలమయమైన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఫోన్ చేసి మాట్లాడారు. సహాయ, పునరావాస చర్యల్లో తమిళనాడుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మోదీ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. -
పన్నీరు సెల్వంకు సతీ వియోగం, ఓదార్చిన సీఎం
సాక్షి, చెన్నై: ఏఐఏడిఎంకే సీనియర్ నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సతీమణి విజయలక్ష్మి (63) కన్నుమూశారు. గత రెండు వారాలుగా చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం డిశ్చార్జ్ కావల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. సీఎం స్టాలిన్, అన్నాడీఎంకే పార్టీ నేతలు, ఇతర రాజకీయ ప్రముఖులు పన్నీరు సెల్వంకు తమ సానుభూతి ప్రకటించారు. పన్నీరుసెల్వంను కలిసి ఓదారుస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ విజయలక్ష్మి మృతి పట్ల సంతాపం తెలిపిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రి దురైమురుగన్, బహిష్కృత అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళ ఇతర నేతలు ఆసుపత్రిలో పన్నీరు సెల్వంను కలిసి ఓదార్చారు. మరోవైపు సెల్వం స్వగ్రామం పెరియాకులమ్‌లో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా సెల్వం, విజయ లక్ష్మి దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. చదవండి: స్టన్నింగ్ టోర్నడో: వీడియో వైరల్ స్వీట్ అడలిన్ అద్భుత ఫోటో షూట్..విషయం తెలిస్తే కన్నీళ్లే! -
కరోనాతో మరణించిన పోలీసు కుటుంబాలకు రూ.25లక్షలు..
చెన్నై: కరోనా కట్టడిలో పోలీసులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వాళ్ల ప్రాణాలు పణంగా పెట్టి మరి కరోనా విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సెకెండ్ వేవ్ లో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన 36 మంది పోలీసుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కొవిడ్ డ్యూటీలు చేస్తూ పోలీసు ఉన్నతాధికారులతో సహా మొత్తం 84 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొలుత 13 మంది పోలీసుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. తాజాగా ఆయా ప్రాంతాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారుల సిఫార్సు మేరకు 36 మంది పోలీసుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలని స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా 35 మంది పోలీసుల కుటుంబాలకు కూడా త్వరలో ఆర్థికసాయం అందిస్తామని స్టాలిన్ తెలిపారు. (చదవండి:రాజీవ్ హత్య కేసులో దోషులను విడుదల చేయండి: సీఎం స్టాలిన్) -
దేశ భవిష్యత్తు కాళీ మాత చేతిలోనే: కేతిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: బెంగాల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మమతా బెనర్జీకి సినీ నిర్మాత, ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మాజీ సభ్యులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో మమత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మమత నిన్నటి వరకు కలకత్తాలో కాళీ అవతారాన్ని చూశామని రాబోయే రోజుల్లో భారత్‌కు కాళీ మాత అవసరముందనీ కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు. 1990లో యువజన కాంగ్రెస్ లో మమతతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీదీ అదే స్పీడ్‌ను కల్గి ఉందన్నారు. మమత బెనర్జీ ‘భారత విప్లవ సింహం’ అని వర్ణించవచ్చునని ఆయన తెలిపారు. రాబోయే కాలంలో వారి నాయకత్వం దేశానికి చాలా అవసరముందని కేతిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలు దృష్టి మమతా బెనర్జీపైనే ఉందని తెలిపారు. కాగా నేడు ప్రమాణస్వీకారం చేసిన నూతన ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కు కేతిరెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ..‘ స్టాలిన్ తన పాలనతో తమిళనాడులో నూతన అధ్యయాన్ని లిఖించాలి. దేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా వెలుగొంది, వారి తండ్రి కరుణానిధి ఆశయాలను, ప్రజల లక్ష్యాలను తీర్చుతూ..వారి పాలన సాగాల’ని పేర్కొన్నారు. వారి అడుగుజాడల్లో తాము నడుస్తామని కేతిరెడ్డి ప్రమాణం చేశారు. చదవండి: తమిళనాడు నూతన సీఎంగా ఎం.కే స్టాలిన్: కేతిరెడ్డి -
తమిళనాడు నూతన సీఎంగా ఎం.కే స్టాలిన్: కేతిరెడ్డి
చెన్నై: తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని, స్టాలిన్ నాయకత్వంలో తమిళనాడు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో తమిళనాడు రాష్ట్రానికి స్టాలిన్ శాశ్వత ముఖ్యమంత్రిగా పనిచేస్తారని కేతిరెడ్డి తెలిపారు. జయలలిత మరణం వెనుక ఉన్న నిజాలను స్టాలిన్ నిగ్గుతేల్చుతారని కేతిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ తను అధికారంలోకి వస్తే జయలలిత మరణంపై సమగ్ర దర్యాప్తు జరిగేలా చూస్తానని తెలిపిన మాటలను కేతిరెడ్డి గుర్తుచేశారు. అదే చేస్తే కరుణానిధి వారసత్వంతో పాటు, జయలలిత రాజకీయ వారసత్వంను కూడా స్టాలిన్ సొంతం చేసుకోవటం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. గత 5 సంవత్సరాలుగా నాయకత్వ లేమితో తమిళనాడు అన్ని రంగాల్లో వెనుకంజ వేసిందని కేతిరెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుంచడం కోసం స్టాలిన్ అడుగులు వేస్తారని పేర్కొన్నారు. గతంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన స్టాలిన్ ముఖ్యమంత్రి పదవికి కూడా న్యాయం చేస్తారన్నారు. చెన్నై మేయర్ గా ఉన్న రోజుల్లో నగరంలో ట్రాఫిక్ సమస్యలను తీర్చడానికి ఎన్నో బ్రిడ్జ్ లు నిర్మించడం వారి పరిపాలన దక్షతకు నిదర్శనమని కేతిరెడ్డి తెలిపారు. డీ.ఎం.కే. యువ నాయకుడుగా ఆయన పార్టీ కి చేసిన సేవలు చాలా గొప్పయని వారి తండ్రి గతం లో కితాబు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. స్టాలిన్ విజయంతో భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో సమూలమార్పు రావటం తథ్యమని కేతిరెడ్డి పేర్కొన్నారు. చదవండి: జూబ్లీహిల్స్ సొసైటీలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలి: కేతిరెడ్డి -
‘మోదీజీ..ఇప్పుడేం చేస్తారు’
సాక్షి,చెన్నై: కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం బీజేపీ చీఫ్ అమిత్ షా కుమారుడు జే షా ఆస్తులు 16,000 రెట్లు పెరిగాయనే ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ తక్షణం స్పందించాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. విపక్ష నేతలపై ఆరోపణలు వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ బృందాల దాడులతో చర్యలు చేపడుతున్న క్రమంలో బీజేపీ చీఫ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై మోదీ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. తక్షణమే ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని జే షాపై వచ్చిన ఆరోపణలపై స్పందించి తమ నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు. అవినీతిని సహించమని పదేపదే చెప్పే మోదీ ఈ వ్యవహారంలో అసలు ఏమైనా చేయగలరా అని స్టాలిన్ సందేహం వ్యక్తం చేశారు. -
విజేత పళని
అనుకూలం 122.. ప్రతికూలం 11 - 29 ఏళ్ల తరువాత చరిత్ర పునరావృతం - రణరంగంగా మారిన తమిళనాడు శాసనసభ... రహస్య ఓటింగ్ కోసం పట్టుబట్టిన డీఎంకే - కుదరదన్న స్పీకర్ ధన్పాల్... విపక్ష సభ్యుల వాగ్వివాదం - అధికార, విపక్ష సభ్యుల బాహాబాహీ - తోపులాటలో విరిగిన మైక్‌లు.. చిరిగిన చొక్కాలు - అసెంబ్లీలో యుద్ధ వాతావరణం.. రెండుసార్లు వాయిదా - డీఎంకే సభ్యుల బహిష్కరణ... కాంగ్రెస్, ముస్లింలీగ్ వాకౌట్ - విపక్ష సభ్యులెవరూ లేకుండానే బలపరీక్ష చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/సాక్షి ప్రతినిధి, చెన్నై: అరుపులు, కేకలు.. ఎగిరిపడిన కుర్చీలు.. విరిగిన మైకులు.. పడిన బెంచీలు.. చిరిగిన చొక్కాలు.. ఎగిరిన కాగితాలు.. ఎమ్మెల్యేల బాహాబాహీ.. మార్షల్స్ బలప్రయోగంతో తమిళనాడు శాసనసభ రణరంగంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్ష రణరంగాన్ని తలపించింది. బలపరీక్షను రహస్య ఓటింగ్ ద్వారా నిర్వహించాలని ప్రతిపక్ష డీఎంకే పట్టుబట్టింది. అందుకు స్పీకర్ తిరస్కరించడంతో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్పీకర్ మైక్ విరిగింది. ఎమ్మెల్యేల చొక్కాలు చిరిగాయి. శాసనసభ యుద్ధవాతావరణాన్ని తలపించింది. స్పీకర్ ధన్పాల్, ప్రధాన ప్రతిపక్షనేత స్టాలిన్ పరాభవం పాలయ్యారు. ఎట్టకేలకు ప్రతిపక్ష డీఎంకే సభ్యుల బహిష్కరణ.. కాంగ్రెస్, ముస్లింలీగ్ సభ్యుల వాకౌట్ తర్వాత... ప్రతిపక్షంలేని సభలో సీఎం పళనిస్వామి విజయం సాధించారు. అన్నాడీఎంకేలోని వైరి వర్గాల నడుమ సాగిన బలపరీక్షలో అనేక ఉద్రిక్త పరిణామాల మధ్య పళనిస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం 122 ఓట్లతో నెగ్గింది. ఆయనకు వ్యతిరేకంగా పన్నీర్ వర్గానికి చెందిన కేవలం11మంది ఓటు వేశారు. ఎట్టకేలకు రెండువారాల ఉత్కంఠకు తెరపడింది. అమ్మ ప్రభుత్వాన్ని పరిరక్షించుకున్నామని సీఎం పళనిస్వామి ఆనందం వ్యక్తం చేశారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గడంతో పదిరోజులపాటు ఎమ్మెల్యేల నివాసంగా మారిన గోల్డన్బే రిసార్టు ఖాళీ అయింది. సీఎంకు వ్యతిరేకంగా ఈరోడ్, కాంగేయం, భవానీల్లోని అన్నాడీఎంకే కార్యాలయాల ముందు పన్నీర్, దీప వర్గీయులు ఆందోళన చేశారు. సీఎం ఇంటిని స్టానికులు ముట్టడించే యత్నం చేశారు. విశ్వాసతీర్మానం ఫలితాలు ఎలా ఉంటాయోనని ఉత్కంఠ నెలకొనడంతో ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. నిత్యం రద్దీగా ఉండే సినిమా థియేటర్లు, పార్కులు జనం లేక బోసిపోయాయి. జయ మరణంతో ముసలం... పురచ్చి తలైవి జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వం సీఎం కావటం.. కొద్దిరోజులకే ఆయన తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఆ తరువాత అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళపై పన్నీర్ తిరుగుబాటుతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యేల క్యాంప్ రాజకీయాలకు శ్రీకారం చుట్టిన నాలుగో రోజు హైకోర్టు సంచలన తీర్పుతో శశికళ జైలు పాలవడం చకచకా జరిగిపోయాయి. సీఎం పీఠం కోసం శశికళ, పన్నీర్ సెల్వం మధ్య జరిగిన పోటీలో అనూహ్యంగా పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు. బలనిరూపణకు గవర్నర్ విద్యాసాగర్‌రావు 15 రోజులు సమయం ఇచ్చినా, సీఎం ప్రమాణస్వీకారం చేసిన రెండవ రోజే పళనిస్వామి బలపరీక్షకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆమేరకే శనివారం ఉదయం 9–10:30 గంటల మధ్య రాహుకాలం కావడంతో 8.45 గంటలకే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కూవత్తూరు క్యాంపు నుంచి బయలుదేరారు. ఒక్కో మంత్రి కారులో నలుగురు ఎమ్మెల్యేల చొప్పున 30 మంది మంత్రుల కారుల్లో 120 మంది ఎమ్మెల్యేలు, సీఎం కారులో ఇద్దరు కూర్చోగా పోలీసు బందోబస్తు నడుమ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో రచ్చ రచ్చ... తమిళనాడు అసెంబ్లీ శనివారం ఉదయం 11గంటలకు ప్రారంభమైంది. స్పీకర్ ధనపాల్ ప్రకటనతో సీఎం పళనిస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ వెంటనే ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్ లేచి అధికార అన్నాడీఎంకే పార్టీ విప్ ఎవరో ప్రకటించాలని పట్టుబట్టారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గం సెమ్మలైని విప్‌గా ప్రకటించగా... పళనిస్వామి వర్గం విప్‌ను ప్రకటించకుండానే విశ్వాస తీర్మానానికి సిద్ధమైంది. దీంతో ప్రతిపక్ష డీఎంకే విశ్వాస పరీక్షను అడ్డుకుంది. ఎమ్మెల్యేలంతా ఆయా నియోజకవర్గాలకు వెళ్లి ప్రజాభిప్రాయం తీసుకున్న తరువాతే ఓటింగ్‌కు అనుమతి ఇవ్వాలని స్టాలిన్, పన్నీర్‌సెల్వం డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ తిరస్కరించారు. అయితే రహస్య ఓటింగ్ నిర్వహించాలని వారిద్దరూ పట్టుబట్టారు. స్పీకర్ అందుకు నిరాకరించడంతో స్టాలిన్‌తో పాటు డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నేలపై కూర్చొని నిరసన తెలియజేశారు. తన అధికారాల్లో ఇతరుల జోక్యాన్ని సహించేది లేదని స్పీకర్ ప్రకటించి సమావేశాన్ని గంటపాటు వాయిదా వేశారు. తిరిగి ఒంటిగంటకు అసెంబ్లీ ప్రారంభమైనా ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు, పన్నీర్‌సెల్వం మద్దతుదారులు రహస్య ఓటింగ్‌కు పట్టుబట్టారు. స్పీకర్ ససేమిరా అనడంతో అన్నాడీఏంకే, డీఏంకే ఎమ్మెల్యేల మధ్య వాగ్వివాదం మొదలైంది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటల్లో బల్లలు ధ్వంసమయ్యాయి... మైక్‌లు విరిగాయి... పేపర్లు చిరిగాయి. సభలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకానొక సమయంలో ఇద్దరు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కుక సెల్వం, రంగనాథన్ స్పీకర్ సీటు వద్ద నిల్చొని నినాదాలు చేస్తున్నారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో కొన్ని క్షణాలపాటు స్పీకర్ సీట్లో కూర్చొన్నారు. తనను కిందకు లాగేసి, చొక్కా చించారంటూ స్పీకర్ ధనపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకు జరిగిన అవమానాన్ని ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే డీఎంకే సభ్యులందరిపైనా సస్పెన్షన్ వేటు వేశారు. అయితే సభను నుంచి బయటకు వెళ్లేందుకు డీఎంకే సభ్యులు నిరాకరించారు. తాము ప్రజలకోసం పోరాడుతున్నామని, తమను బలవంతంగా బయటకు తీసుకెళ్తే ఆత్మహత్యలకైనా సిద్ధమంటూ హెచ్చరించారు. ఎట్టకేలకు మార్షల్స్ 2.50 గంటలకు ప్రతిపక్ష సభ్యులను బలవంతంగా సభనుంచి ఖాళీ చేయించగలిగారు. సుమారు 25 మంది మార్షల్స్ ప్రతిపక్ష నేత స్టాలిన్‌ను చేతుల్తో పైకి ఎత్తుకుని బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలో జరిగిన పెనుగులాటలో స్టాలిన్ చొక్కా చిరిగిపోయింది. తమ పార్టీ ఎమ్మెల్యేలతో స్టాలిన్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిశారు. సభలో తమపై జరిగిన దౌర్జన్యం గురించి ఫిర్యాదు చేశారు. అనంతరం మెరీనా బీచ్‌లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. డీఎంకేకు మద్దతుగా వారి మిత్రపక్షం కాంగ్రెస్, ముస్లింలీగ్ కూడా బలనిరూపణను బాయ్‌కాట్ చేశాయి. ప్రతిపక్షాలు లేకుండా తీర్మానం... ప్రతిపక్ష సభ్యులెవరూ లేకుండా సభ మూడు గంటలకు మళ్లీ ప్రారంభమైంది. సీఎం పళనిస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా స్పీకర్ చదివి వినిపించారు. తీర్మానంపై సభ్యులు ప్రసంగించి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం పరిపాటైనా... నేడు అసెంబ్లీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లేచి నిలబడితే లెక్కించే ప్రక్రియను ప్రవేశపెడుతున్నానని స్పీకర్ చెప్పారు. ముందువైపున మూడు లైన్లలో అన్నాడీఎంకే, వెనుకవైపున్న మిగిలిన మూడులైన్లలో డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అయితే తీర్మానం ప్రవేశపెట్టే సమయానికి ప్రతిపక్ష సభ్యులెవ్వరూ సభలో లేరు. పళనిస్వామి ప్రవేశపెట్టిన విశ్వాసతీర్మానంపై అసెంబ్లీలో సభ్యులు లేచి నిలబడి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగానే అనుకూలంగా 122, ప్రతికూలంగా 11 ఓట్లు వచ్చినట్లు స్పీకర్ ప్రకటించారు. చరిత్ర పునరావృతం... తమిళనాడు రాజకీయాల్లో బలపరీక్షను ఎదుర్కొన్న పార్టీగా అన్నాడీఎంకే మరోసారి చరిత్ర సృష్టించింది. ఎంజీఆర్ మరణం తరువాత జానకీ రామచంద్రన్, జయలలిత వర్గాల మధ్య పోటీ తలెత్తింది. 1988 జనవరి 27న ముఖ్యమంత్రి పీఠానికి బలపరీక్ష నిర్వహించారు. అప్పుడు కూడా అసెంబ్లీలో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సభ్యులు సభలోనే కొట్టుకున్నారు. తప్పని పరిస్థితుల్లో తొలిసారి పోలీసులు సభలోకి ప్రవేశించాల్సి వచ్చింది. జయలలిత వర్గానికి నెడుంజెళియన్ నాయకత్వం వహించారు. ఆ సమయంలో స్పీకర్‌గా ఉన్న పీహెచ్ పాండియన్ ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు ప్రతిపక్ష సభ్యులపై అనర్హత వేటు వేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. చివరకు జానకీ రామచంద్రన్ విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారు. అదే విధంగా శనివారం జరిగిన విశ్వాస పరీక్షలోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ చొక్కా చిరిగిపోయింది. ప్రతిపక్ష నేత స్టాలిన్ చొక్కాను చించివేశారు. తమకు జరిగిన అవమానాన్ని ఎవరికి చెప్పుకోవాలని ఇటు స్పీకర్, అటు ప్రతిపక్ష నేత ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మీద ఎప్పుడు విశ్వాస పరీక్ష నిర్వహించినా తమిళనాడు శాసనసభలో యుద్ధవాతావరణం నెలకొనడం గమనార్హం. తీరని అవమానం: స్పీకర్ ధనపాల్ అసెంబ్లీ చరిత్రలో ఎవ్వరూ ఎరగని, జరగకూడని అవమానానికి తాను లోనైనానని స్పీకర్ ధనపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. బలనిరూపణ తర్వాత ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల్లో అట్టడుగు ఆది ద్రావిడ సామాజిక వర్గానికి చెందిన తాను అమ్మ దయవల్ల ఇంతటి ఉన్నతస్థితికి చేరుకున్నానని చెప్పారు. ప్రధానప్రతిపక్ష నేత నడుచుకున్న తీరు ఎంతో బాధాకరమని, ఆయన వైఖరికి సిగ్గుపడుతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. తాను నిబంధనలకు అనుగుణంగానే నడుచుకున్నానని స్పష్టంచేశారు. అనంతరం అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అమ్మ ప్రభుత్వం నిలబడింది: సీఎం పళనిస్వామి తమిళనాడులో అమ్మ ప్రభుత్వాన్ని పరిరక్షించుకున్నామని సీఎం పళనిస్వామి ఆనందం వ్యక్తంచేశారు. విశ్వాసతీర్మానం నెగ్గగానే మంత్రివర్గ సహచరులతో కలిసి మెరీనాబీచ్‌లోని అమ్మ సమాధి వద్దకు వచ్చి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... విశ్వాస తీర్మానాన్ని విఫలం చేసేందుకు డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు విశ్వప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎంజీఆర్, జయలలితల ఆశయాల సాధన కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ చిన్నమ్మ చేసిన శపథం నెరవేరిందన్నారు. అన్నాడీఎంకే నుంచి విడిపోయినవారంతా డీఎంకేతో చేతులు కలిపారని, అసెంబ్లీ చోటుచేసుకున్న సంఘటనలే ఇందుకు సాక్ష్యమని చెప్పారు. నెగ్గిన విశ్వాస తీర్మానాన్ని గవర్నర్‌కు పంపామని తెలిపారు. బలపరీక్ష సమయానికి సభలో 133మందే తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 235 మంది సభ్యులుండగా శనివారం 230 మంది హాజరయ్యారు. అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 136 సభ్యుల బలం ఉండగా జయ మరణంతో 135 మంది ఉన్నారు. ఇందులో శశికళ వర్గానికి చెందిన 122 మంది, పన్నీర్‌సెల్వానికి చెందిన 11 మంది హాజరయ్యారు. పన్నీర్ వర్గానికి చెందిన కోయంబత్తూరు ఎమ్మెల్యే అరుణ్‌కుమార్ గైర్హాజరుతో మొత్తం 133గా మిగిలింది. డీఎంకేకు 89 మంది సభ్యులుండగా అస్వస్థత కారణంగా డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అసెంబ్లీకి రానందున 88 మంది సభ్యులు హాజరయ్యారు. అలాగే 8 మంది కాంగ్రెస్ సభ్యులు, ముస్లింలీగ్ ఎమ్మెల్యే వచ్చారు. అయితే డీఎంకే సభ్యులను బహిష్కరించడం... కాంగ్రెస్, ముస్లింలీగ్ సభ్యులు బహిష్కరించడంతో ఓటింగ్ సమయానికి సభలో అన్నాడీఎంకేకు చెందిన 133మంది సభ్యులు మాత్రమే మిగిలారు. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి చెన్నైకు చిన్నమ్మ? అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ నాడూ.. నేడూ.. అదే డ్రామా! చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు -
జనం ఓట్లేసింది జయకు.. ఆమె ఫ్యామిలీకి కాదు
- శశికళను ప్రజలు సీఎంగా అంగీకరించరు - డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కామెంట్స్ చెన్నై: తమిళనాడు అధికార పార్టీ ఏఐఏడీఎంకేలో గంటగంటకూ రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అజెండా ప్రకటించకుండా శాసనసభా పక్ష సమావేశానికి పిలుపునివ్వడంతో మొదలైన అలజడి.. శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారన్న వార్తలతో పతాకస్థాయికి చేరింది. ఎమ్మెల్యేలను చీల్చడంద్వారా సీఎం పన్నీర్ సెల్వం శశికళకు షాకిచ్చారని, జయ మేనకొడలు దీపకు కూడా కొందరు ఎమ్మెల్యేల మద్దతు ఉంన్నదని, రెండాకుల పార్టీ మూడు ముక్కలైందని.. ఆదివారం ఉదయం నుంచి రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిణామాలపై విపక్ష డీఎంకే ఘాటుగా స్పందించింది. తమిళనాడు ప్రతిపక్షనేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె.స్టాలిన్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఏఐడీఎంకేలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామన్న స్టాలిన్.. శశికళనుకానీ, జయలలిత ఇతర కుటుంబసభ్యులనుకానీ ముఖ్యమంత్రిగా ప్రజలు అంగీకరించరని అభిప్రాయపడ్డారు. ‘గత ఎన్నికల్లో తమిళ ప్రజలు ఓటేసింది జయలలితకేకానీ, ఆమె కుటుంబసభ్యులకు కాదు. కాబట్టి శశికళనో, మరొకరినో సీఎంగా ప్రజలు ఒప్పుకోరు’అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.