
ఢిల్లీ: ఉచిత పథకాలకు సంబంధించి దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇండియా టుడే కాంక్లెవ్ లో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఉచిత పథకాలపై దేశ వ్యాప్త చర్చ జరగాలన్నారు. ఇక పెట్టుబడులన్నీ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రానికి తరలించుకుపోతున్నారన్న సీఎం రేవంత్.. ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు.
‘నెలకు 18 వేల కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణకు వస్తే...అందులో 13 వేల కోట్ల రూపాయలు జీతాలు అప్పుల చెల్లింపులకే పోతుంది. మిగిలిన 5000 కోట్ల రూపాయలలోనే అభివృద్ధి, సంక్షేమ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మౌలిక వసతుల ప్రాజెక్టులపై కనీసం 500 కోట్ల రూపాయలు కూడా మేము ఖర్చు పెట్టలేకపోతున్నాం. 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా డీ లిమిటేషన్ జరగాలి. డిలిమిటేషన్ పై చర్చ జరిపేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. హిందీని బలవంతంగా రుద్దడాన్ని మేము వ్యతిరేకిస్తాం. హైదరాబాదులో ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికి అవసరమైన మౌలిక వసతులున్నాయి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment