సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టుకోరాదని గవర్నర్‌ను మీరెందుకు గట్టిగా అడగరని సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది. గవర్నర్ బిల్లులపై అభిప్రాయం పెండింగ్‌లో పెట్టడం వల్ల రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతోందంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సోమవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్డీవాలా ధర్మాసనం ముందుకొచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ మధ్యప్రదేశ్‌లో బిల్లుకు వారంలో ఆమోదం వస్తుందని, గుజరాత్‌లో నెల రోజులు దాటదని, కానీ తెలంగాణలో ఎందుకు ఆలస్యం అవుతోందో అర్థం కావడంలేదని పేర్కొన్నారు. దీనిపై సొలిసిటర్ జనరల్ జోక్యం చేసుకొని గవర్నర్ ఇలా చేయడానికి కారణాలేంటో తెలుసుకొని తగిన సూచనలు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను ఏప్రిల్ 10న విచారిస్తామని కోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment