
బెంగాల్ దీదీ.. ఇది ఆరంభమే: అమిత్ షా
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. బెంగాల్‌లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా పలువురు టీఎంసీ నేతలను తమ వైపుకు తిప్పుకుంటుంది. పూర్తి వివరాలు..
పార్టీ ఓ పెద్ద కుటుంబం: సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసమ్మతి నేతలతో జరిపిన భేటీ నేటికి ముగిసింది. దాదాపు 5 గంటలపాటు కొనసాగిన సుదీర్ఘ సమావేశంలో 19 మంది నాయకుల అభిప్రాయాలు ఆమె అడిగి తెలుసుకున్నారు. వారి సూచనలు, సలహాలు స్వీకరించారు. పూర్తి వివరాలు..
టీడీపీ జాతీయ పార్టీనా?: ఎమ్మెల్యే వంశీ
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రిఫరెండం అనడం చూస్తుంటే ఆయన వయసు మందగించిందని మరోసారి బయటపడిందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు.జాతీయ పార్టీ అధ్యక్షుడని చెప్పుకునే చంద్రబాబు రిఫరెండం అనే మాట ఏ విధంగా మాట్లాడతారని ధ్వజమెత్తారు. పూర్తి వివరాలు..
‘ఆ 15 లక్షలు ఏమయ్యాయి..!’
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజా సమస్యల పై మాట్లాడకుండా యువతను రెచ్చగొట్టే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పూర్తి వివరాలు..
సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ 3607 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) కేఎస్ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ 2021 జనవరి 8వ తేదీ నుంచి 13 వరకూ పొరుగు రాష్ట్రాలు, నగరాల నుంచి రాష్ట్రానికి ప‍్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు..
బంగ్లాదేశ్ షిప్‌ను ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా..
టూరిజం రంగానికి రీస్టార్ట్ ప్యాకేజీ అందిస్తున్నామని, రూ.200కోట్ల ప్యాకేజీని అతిధ్య రంగానికి కేటాయించాలని నిర్ణయించామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆయన శనివారం రాష్ట్ర టూరిజం కొత్త పాలసీని ప్రకటించారు. పూర్తి వివరాలు..
గ్రేటర్ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్..
వచ్చే ఏడాది తొలి వారంలోనే హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ జలమండలి ద్వారా 20 వేల లీటర్ల వరకు తాగు నీటిని ఉచితంగా అందిస్తామన్నారు. పూర్తి వివరాలు..
'ప్రపంచాన్ని చైనా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది'
ప్రపంచాన్ని చైనా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోందని బీజేపీ నేత, ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ రామ్ మాధవ్ అన్నారు. ఇండియా- చైనా మధ్య వివాదం ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం అనే అంశంపై ఆయన మాట్లాడారు. పూర్తివివరాలు..
గుడ్‌బై చెప్పిన ‘ముంబై మిర్రర్’
ఎంతో పాఠకాదరణ పొందిన టాబ్లాయిడ్ దిన పత్రికలు ‘ముంబై మిర్రర్’, ‘పుణే మిర్రర్’ డిసెంబర్ 5వ తేదీ, శనివారం నాటి సంచికతో సెలవు తీసుకున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతినడంతో వీటిని మూసివేయక తప్పలేదని వీటిని ప్రచరిస్తున్న ‘టైమ్స్ గ్రూప్’ ప్రకటించింది. పూర్తి వివరాలు..
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే అంతేనట!
కరోనావైరస్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలతో మొదటినుంచీ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటే మనుషులు మొసళ్లలా మారిపోవచ్చంటూ సరికొత్త వివాదానికి తెర తీసారు. పూర్తి వివరాలు..
2020: ఐపీవో నామ సంవత్సరం
ఈ కేలండర్ ఏడాది(2020)ని ఐపీవో నామ సంవత్సరంగా పేర్కొనవచ్చునంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ ఏడాది ఇప్పటివరకూ 15 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. తద్వారా రూ. 30,000 కోట్లకుపైగా సమీకరించాయి. పూర్తి వివరాలు..
మంచు లక్ష్మీ కూతురు వరల్డ్ రికార్డ్
డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయ, ప్రముఖ నటి మంచు లక్ష్మీ కూతురు విధ్యా నిర్వాణ మంచు ఆనంద్ అరుదైన రికార్డ్ ని సాధించింది. `యంగెస్ట్ చెస్ ట్రైనర్`గా నొబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. పూర్తి వివరాలు..
36.. ఆలౌట్.. చాలా సంతోషంగా ఉంది: అక్తర్
‘‘నిజానికి నిన్న రాత్రి మ్యాచ్ చూడలేకపోయాను. అందుకే ఈరోజు ఉదయం నిద్రలేవగానే టీవీ ఆన్ చేశాను. బోర్డు మీద టీమిండియా స్కోరు 369 అని ఉందనుకున్నా. వెంటనే కళ్లు నులుముకుని జాగ్రత్తగా మరోసారి పరిశీలించా. అది 369 కాదు 36/9. ఒక రిటైర్డ్ హర్ట్. పూడ్చలేని నష్టం. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు బ్యాటింగ్ తీరు ఇలా అయిపోయింది’’ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ భారత జట్టు ఆట తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పూర్తి వివరాలు..
డ్యాన్సర్ గాయత్రి ఆత్మహత్య కేసులో ట్విస్ట్
బెజవాడలో ఈవెంట్ డ్యాన్సర్ గాయత్రి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. గాయత్రి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు గాయత్రి ఇంటికి నీలిమ అనే యువతి వచ్చివెళ్లిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు..