టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు | Today Top News 28th December 2020 | Sakshi
Sakshi News home page

టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

Published Mon, Dec 28 2020 6:00 PM | Last Updated on Mon, Dec 28 2020 6:18 PM

Today Top News 28th December 2020 - Sakshi

దాదా భేటీపై రాజకీయ దుమారం
మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం మరింత వేడెక్కింది. రాజకీయ పార్టీల నేతల వరుస పర్యటనలతో కోల్‌కత్తా వీధుల్లో కోలాహాలం నెలకొంది.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సైతం బెంగాల్‌లో పర్యటించి.. తొలి విడత ప్రచారాన్ని సైతం ముగించారు. పూర్తి వివరాలు..

టీఆర్‌ఎస్‌కు షాక్‌.. మున్సిపల్‌ చైర్మన్‌ గుడ్‌బై
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో వరుస ఓటములను ఎదుర్కొంటున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఊహించిన షాక్‌ ఎదురైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఆదిబట్ల మున్సిపల్‌ చైర్మన్‌ టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. పూర్తి వివరాలు..

‘అప్పుడు తిట్లు.. ఇప్పుడు మద్దతా..’
రైతుల ప‌ట్ల సీఎం కేసీఆర్‌ వివ‌క్ష చూపుతున్నారని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల అభివృద్ధికి పాటుప‌డాల్సిన స‌ర్కార్.. రైతుల‌ను ఎందుకు చిన్నచూపు చూస్తుందని విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాలు..

ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు: సీఎం జగన్‌
శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు' పథకం ప్రారంభించారు. ఊరందూరులో 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు' పైలాన్‌ని ఆవిష్కరించారు. తొలి విడతలో నిర్మించనున్న ఇళ్ల పనులను సీఎం జగన్‌ ప్రారంభించారు. పూర్తి వివరాలు..

దిగ్విజయంగా ముగిసిన ‘డ్రై రన్’
కృష్ణా జిల్లాలోని అయిదు సెంటర్లలో కరోనావైరస్‌‌ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రక్రియ దిగ్విజయంగా ముగిసింది. జిల్లాలోని అయిదు సెంటర్లలో వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించారు. డ్రై రన్ ఏ విధంగా కొనసాగిందో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆద్వర్యంలోని‌ కమిటీ పరిశీలించింది. ప్రతీ సెంటర్ లో 25 మంది చొప్పున వ్యాక్సినేషన్ వేశారు. పూర్తి వివరాలు..

ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు..
ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు..

ఎమ్మార్వో ఆఫీసులో అధికారుల తిట్ల పురాణం..
ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు కర్తవ్యం మరిచారు. ఒకరికొకరు సమన్వయంతో పనిచేయాల్సిందిపోయి సోయి మరచి వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని తహసిల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో వెలుగు చూసింది. పూర్తి వివరాలు..

చైనాకు గట్టి కౌంటరిచ్చిన భారత్‌..!
చైనా పౌరులను భారత్‌ విమానాల్లోకి అనుమతించవద్దని అన్ని విమానయాన సంస్థలను  కేంద్రం అనధికారికంగా కోరింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనధికారిక ఆదేశాన్ని అందుకున్నట్లు విమానయాన వర్గాలు ధృవీకరించాయి. కాగా గతంలో కరోనా వైరస్‌ వ్యాప్తిస్తున్న తరుణంలో భారత్‌ చైనాతో విమాన సర్వీసులను నిలిపివేసింది.  పూర్తి వివరాలు..

200 మంది పర్యాటకుల పరారీ
స్విట్జర్లాండ్‌లోని ‘వర్బియర్‌ స్కై రిసార్ట్‌’ విదేశీ యాత్రికులను విశేషంగా ఆకర్షించే విలాసవంతమైన విహార కేంద్రం. ఆ కేంద్రానికి ఎక్కువగా బ్రిటీష్‌ పర్యాటకులే వస్తుంటారు. బ్రిటన్‌లో ప్రాణాంతక కరోనా వైరస్‌ నుంచి రూపాంతరం చెందిన కొత్తరకం వైరస్‌ అక్కడ విజృంభిస్తోందన్న వార్తలు రావడంతో బ్రిటిన్‌ నుంచి ప్రజల రాకపోకలను డిసెంబర్‌ 14వ తేదీ నుంచి స్విట్జర్లాండ్‌‌ ప్రభుత్వం నిషేధించింది. పూర్తి వివరాలు..

19 సెషన్లలో 13 సార్లు కొత్త రికార్డ్స్‌ 
కోవిడ్‌-19 భయాల నుంచి బయటపడి రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి దూకుడు చూపాయి. సెన్సెక్స్‌ 380 పాయింట్లు జంప్‌చేసి 47,354కు చేరగా.. నిఫ్టీ 124 పాయింట్లు ఎగసి 13,873 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా నాలుగో రోజూ మార్కెట్లు లాభాల బాటలో కదిలాయి.  పూర్తి వివరాలు..

ఏఆర్‌ రెహమాన్‌ ఇంట్లో విషాదం..
ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు‌ ఏఆర్‌ రెహమాన్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి కరీమా బేగం సోమవారం చెన్నైలో కన్నుమూశారు.  పూర్తి వివరాలు..

ధోనికి ‘స్పిరిట్‌ ఆఫ్‌ ద డెకేడ్‌’.. కారణం ఇదే!
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తాజాగా ప్రకటించిన ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల అవార్డుల్లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండు అవార్డులను గెలుచుకున్నాడు. ఇటీవల ఐసీసీ నామినేట్‌ చేసిన ఐదు అవార్డులకు కోహ్లి నామినేట్‌ కాగా అందులో రెండు అవార్డులు అతన్ని వరించాయి. పూర్తి వివరాలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement