
1. Presidential Polls: ‘రాష్ట్రపతి’ బరిలో ఉమ్మడి అభ్యర్థి!
రాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించే దిశగా ప్రయత్నాలకు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ పదును పెడుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే పలు విపక్ష నేతలతో వరుస సంప్రదింపులు జరిపిన ఆమె, వాటి మధ్య ఏకాభిప్రాయ సాధన బాధ్యతను పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. ఊపందుకుంటున్న ‘ఊళ్లు’
‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న వైఎస్సార్, జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం ఇళ్లలో 25 శాతం ఇళ్లు పునాది దశను దాటిన లేఅవుట్లలో ఈ పనులను చేపడుతున్నారు.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. Russia-Ukraine war: రష్యాను ఒంటరిని చేయలేరు
భారత్, చైనాతోనే గాక లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలోనూ భాగస్వామ్యం నెలకొల్పుకొనే అవకాశం తమకుందని రష్యా అధ్యక్షుడు శుక్రవారం పుతిన్ అన్నారు. రష్యాను ఒంటరిని చేయడం అసాధ్యమని పరోక్షంగా తేల్చిచెప్పారు.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. ఈ పాపం బాబుది కాదా?
‘గత తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే జీవీఎంసీ పరిధిలో ఉన్న రహదారులన్నీ దెబ్బతిన్నాయి. వాస్తవానికి నాడు ఎన్ని లోపాలున్నా, రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నా, పచ్చ పత్రికలు ఏమాత్రం పట్టించుకోలేదు.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. ఢిల్లీ దారిలో స్పీడ్‌గా.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అంశంపై కేసీఆర్
‘దేశంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం. కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో విఫలమై కనుమరుగవుతున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో చురుకుగా దూసుకుపోవాల్సిన అవసరం ఉంది.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. ధగధగల బంగారు నిధి.. సముద్ర గర్భంలో.. లక్ష కోట్ల విలువ!
300 ఏళ్లుగా సముద్ర గర్భాన దాగున్న శాన్‌జోస్ అనే యుద్ధనౌకలోని అపార సంపదతో జాడ ఎట్టకేలకు దొరికింది. కార్టజినా తీరానికి సమీపంలో దీన్ని కనుగొన్నట్లు కొలంబియా నేవీ ప్రకటించింది. సంబంధిత ఫుటేజీని విడుదల చేసింది.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. అఫీషియల్: బాలకృష్ణ-అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్
బాలకృష్ణ మంచి జోరు మీదున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్న ఆయన తాజాగా 108వ చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడు. శుక్రవారం బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా 108వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. టీ20 ప్రపంచకప్‌కు ఉమ్రాన్ మాలిక్‌ను ఎంపిక చేయవద్దు: రవిశాస్త్రి
ఐపీఎల్‌లో అదరగొట్టిన స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌కు భారత జట్టులో చోటు దక్కిన సంగతి తెలిసిందే. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగుతోన్న టీ20 సిరీస్‌లో భారత జట్టులో ఉమ్రాన్ భాగంగా ఉన్నాడు. అయితే ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20కు తుది జట్టులో ఉమ్రాన్‌కు చోటు దక్కలేదు.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. అన్ని రుణాలూ భారమే
వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు మరింత భారంగా మారుతున్నాయి. ఆర్‌బీఐ కీలకమైన రెపో రేటు పెంచడంతో దాదాపు అన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రేట్లను పెంచుతూ నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. అడవుల్లో ఉండిపోయింది
‘ఒక సమయం వస్తుంది. ఈ నగరాలకు దూరం వెళ్లిపోవాలనిపిస్తుంది. కాకుంటే నేను ఆ పిలుపు ముందు విన్నాను’ అంటుంది 35 కావ్య. నోయిడాలో ఫ్యాషన్ ఉత్పత్తుల రంగంలో పని చేసిన కావ్య గత పదేళ్లుగా సెలవుల్లో భారతీయ పల్లెలను తిరిగి చూస్తూ తన భవిష్యత్తు పల్లెల్లోనే అని గ్రహించింది.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి