
తిరువనంతపురం: శబరిమల సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మృత్యువాతపడ్డారు. కర్నూల్‌లోని బుధవారపేటకు చెందిన 11 మంది అయ్యప్ప స్వాములు బుధవారం టెంపోలో శబరిమలకు వెళ్లారు. శబరిమలకు 60 కి.మీ. దూరంలో టెంపో వాహనాన్ని నిలిపి.. టీ తాగడానికి వెళ్లారు. ఇంతలో వెనుక నుంచి మరో వాహనం టెంపోను ఢీ కొట్టి.. భక్తులపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేరళ పోలీసులు కర్నూలు పోలీసులకు తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాద గురించి తెలియడంతో బాధితుల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
చదవండి: ఆ గ్రామంలో వింత సంప్రదాయం.. మా ఊరికి రావొద్దు..
Comments
Please login to add a commentAdd a comment