లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎంపీ అతుల్ రాయ్‌కు ఊరట లభించింది. అత్యాచార కేసులో ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది వారణాసి కోర్టు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోసి నియోజకవర్గంలో బీఎస్పీ తరపున భారీ మెజార్టీతో గెలిచాడు అతుల్ రాయ్. అయితే.. గెలిచిన తర్వాతే రేప్ కేసులో పోలీసులకు లొంగిపోయాడు.
2019లో తూర్పు యూపీకి చెందిన 24 ఏళ్ల యువతి.. అతుల్‌రాయ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. 2018లో వారణాసిలోని తన ఇంట్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈలోపు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చేదాకా పోలీసులను తప్పించుకుంటూ తిరిగాడు అతుల్ రాయ్. నెల రోజుల తర్వాత.. 2019 జూన్‌లో అతుల్ రాయ్ పోలీసులకు లొంగిపోయాడు. అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్నాడు. అయితే..
► సుప్రీం కోర్టు పెరోల్‌కు అనుమతి ఇవ్వగా.. అలహాబాద్ హైకోర్టు రెండు రోజుల పెరోల్ ఇవ్వడంతో BSP MP Atul Rai పార్లమెంటేరియన్‌గా ప్రమాణం చేశాడు. ఆపై తిరిగి జైలుకే వెళ్లాడు.
► నవంబర్ 2020లొ అతుల్ రాయ్ సోదరుడు బాధితురాలి మీద ఫోర్జరీ కేసు నమోదు చేశాడు. అయితే అత్యాచార కేసు వాపసు తీసుకునేందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయింది ఆమె. అయితే కోర్టు ఆమె వాదనను పట్టించుకోలేదు. ఆగస్టు 2021లో ఆమెకు వ్యతిరేకంగా నాన్ బెయిల్ వారెంట్‌ను జారీ చేసింది.
► ఆ బాధతో ఆమె, ఆమె స్నేహితుడు సుప్రీం కోర్టు ముందు ఆగష్టు 16, 2021న నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. అంతేకాదు ఆ అఘాయిత్యాన్ని ఫేస్‌బుక్ లైవ్‌లో స్ట్రీమ్ చేశారు కూడా.
► ఆత్మహత్యాయత్నానికి ముందు పలువురు పోలీస్ అధికారులు, జడ్జిలు రాయ్‌తో కుమ్మకు అయ్యారంటూ వాళ్ల పేర్లను సైతం గట్టిగా అరిచి చెప్పారు వాళ్లు.
► ఐదు రోజుల తర్వాత ఆమె స్నేహితుడు, మరో మూడు రోజుల తర్వాత బాధితురాలు మృతి చెందారు.
► అయితే అత్యాచార కేసులో అతుల్‌రాయ్‌కు ఊరట లభించినా.. జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు ఇప్పట్లో లేవు.
► అందుకంటే.. బాధితురాలిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు కారణంగా జైల్లో గడపాల్సిందే.
► జులైలో ఎంపీ అతుల్‌రాయ్ బెయిల్ కోసం అలహాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయినా కోర్టు ఊరట ఇవ్వలేదు. ఇప్పుడు వారణాసి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అత్యాచార కేసులో రాయ్‌ను నిర్దోషిగా ప్రకటించారు.
ఇదీ చదవండి: అత్యాచారానికి గురైన మైనర్.. మగ బిడ్డకు జననం.. 27 ఏళ్ల తర్వాత తిరిగొచ్చి తల్లి కోసం కొడుకు పోరాటం
Comments
Please login to add a commentAdd a comment