
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 19 ఏళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటన తరువాత దేశం మొత్తం నిరసనలు మొదలయ్యాయి. బీజేపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేదంటూ కొంత మంది సోషల్‌మీడియా వేదికగా కూడా ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ఫోటో వైరల్‌గా మారింది. అందులో ఒక మహిళ ముళ్ల తీగ చుట్టుకొని నిరసన తెలుపుతోంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ ఇది మోదీ సర్కారుకు చెంపదెబ్బ అని, ఆ శబ్ధం ప్రపంచం మొత్తానికి వినబడుతున్నా, బీజేపీని సమర్థించేవారికి వినపించడం లేదంటూ కొంతమంది విమర్శిస్తున్నారు.
ये तस्वीर प्रधानमंत्री और भाजपा सरकार को तमाचा है जिस की गुंज पुरे विश्व को सुनाई देगी, #भाजपाइयों को छोड़कर पुरे भारत मे बढ़ते बलात्कार की घटनाओं को लेकर इस महिला ने अपने पुरे जिस्म को काटेंदार तार से लपेटकर ये संदेश दिया है,
— ADEEL KHAN (@ADEEL_KHAN_AZMI) September 30, 2020
कि भाजपा की सरकार मे महिला सुरक्षित नही हैं...! pic.twitter.com/Sm2tfqPgBk
అయితే ఆ ఫోటో హత్రాస్ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సమయంలో తీసిన ఫోటో కాదు అని తేలింది. ఆ ఫోటోలో ఉన్న మహిళ పేరు జనని కురేయ్ అని, ఆమె శ్రీలంకలోని కొలంబియాకు చెందిన ఒక ఆరిస్టు అని తేలింది. ‘ఓసారియా’ అని పిలువబడే శ్రీలంక సంప్రదాయ వస్త్ర అలంకరణను ఆమె 2015లో రోడ్డు మీద జరిగిన ప్రదర్శనలో ధరించిందని తేలింది. దీంతో ఈ ఫోటో పేరుతో మోదీ సర్కార్‌పై తప్పుడు ప్రచారం జరుగుతుందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.