న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఢిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో మహిళలకు ప్రవేశం కల్పించడానికి త్రివిధ దళాల అధిపతులు అంగీకరించినట్లు కేంద్రం ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. మహిళలు ఎన్డీఏ కోర్సులు అభ్యసించేలా మార్గదర్శకాలను రూపొందించడానికి తగిన సమయం అవసరమని కేంద్రం పేర్కొంది. ఎన్డీఏ పరీక్షలకు మహిళలను అనుమతించకపోవడంపై సుప్రీం కోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు మహిళలను ఎన్‌డీఏ పరీక్షకు అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు అనుసరిస్తూ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ అంశంపై అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, బుధవారం కోర్టుకు వివరణ ఇస్తూ...."నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ), నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఇవ్వాలని కేంద్రం, త్రివిద దళాలు అంగీకరించాయి. ఇది చాలా గొప్ప వార్త. దీనికి సంబంధించిన పూర్తి అఫిడవిట్‌ని అందజేస్తాం. జూన్ 24న జరగాల్సిన ఎగ్జామ్ నవంబర్ 14కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రవేశాలు యథాతథంగా జరిగేలా చేయండి" అని ధర్మాసనాన్ని కోరారు.(చదవండి: ఎన్‌డీఏ ప్రవేశ పరీక్షలో మహిళలకూ అవకాశం)
ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సాయుధ దళాలలు తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో తమకెంతో ఆనందం కలిగించిందని పేర్కొంది. మహిళలు ఎన్డీఏ కోర్సలు చేసేలా మార్గం సుగమం చేయడానికి ప్రభుత్వానికి తగిన సమయం పడుతుందని..అలాగే ఒక్కరోజులో సంస్కరణలు తీసుకురాలేమని ధర్మాసనం వెల్లడించింది. దేశ సంరక్షణలో సాయుధ దళాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి అత్యున్నత శాఖ లింగ వివక్షతకు తావివ్వకుండా...లింగ సమానత్వం కోసం కృషి చేయాలంటూ ..జస్టీస్ ఎస్‌కే కౌల్, జస్టీస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం కోరింది.
చదవండి: ‘ఆలస్యానికి మా బాధ్యత లేదు’ రైల్వేశాఖపై సుప్రీంకోర్టు ఫైర్
Comments
Please login to add a commentAdd a comment