
లక్నో: భవ్య రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరిగే రోజున దీపావళి నిర్వహిస్తామని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. భూమి పూజ జరిగే ఆగస్టు 5 ను శ్రీరాముడు అయోధ్యకు తిరిగొచ్చిన రోజుగా భావించి ఈ వేడుక నిర్వహిస్తామని ప్రకటించారు. ఆగస్ట్ 4, 5వ తేదీల్లో అయోధ్యలోని అన్ని ఆలయాలు, ఇళ్లలో దీపాలు వెలిగించాలని ఆయన పిలుపునిచ్చారు. రామమందిర భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం ఆయన అయోధ్యలో పర్యటించారు. భూమిపూజ జరిగే ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. తర్వాత శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులతో సమావేశమయ్యారు. ఆగస్టు 5 న ప్రధాని మోదీ చేతులమీదుగా అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరగనున్నది తెలిసిందే.
(భూమి పూజకు 40 కిలోల వెండి ఇటుక)
Comments
Please login to add a commentAdd a comment