
భయాందోళనకు గురికావొద్దు
తాంసి: భీంపూర్ మండలంలోని కోజ్జన్‌గూడ శివారులో ఉన్న సూర్యగుట్ట అటవీ ప్రాంతంలో పులి సంచారం లేదని, ప్రజలు భయాందోళన చెందవద్దని బీట్ అధికారి రామేశ్వర్ స్పష్టం చేశారు. శుక్రవారం సూర్యగుట్ట సమీపంలో కుక్కపై అడవి జంతువులు దాడిచేసి హతమార్చాయి. సంఘటన స్థలాన్ని అటవీశాఖ బీట్ అధికారి రామేశ్వర్ శనివారం ఎనిమల్ ట్రాకర్స్‌తో కలిసి పరిశీలించారు. కుక్క కళేబరం వద్ద పులి లేదా చిరుతపులి సంచరించిన ఆనవాళ్లు లేవన్నారు. శునకాన్ని హైనా లేదా నక్క హతమార్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎనిమల్ ట్రాకర్స్ ఆత్రం నాందేవ్, స్థానికులు ఉన్నారు.
విజిలెన్స్ అధికారుల తనిఖీ
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపాలిటీలో శనివారం విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. విజిలెన్స్ సీఐ ప్రశాంత్, ఏఈఈ శశిధర్, తహసీల్దార్ గిరీశ్‌రెడ్డి మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పన్నుల వివరాలు, ఇతర ఆదాయ మార్గాల వివరాలు సేకరించారు.
డీటీసీగా రవీందర్ కుమార్
ఆదిలాబాద్‌టౌన్: రవాణశాఖ ఉమ్మడి ఆది లాబాద్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ (డీటీసీ)గా పి.రవీందర్‌కుమార్ నియామకమయ్యారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు నిజామాబాద్ జిల్లా డీటీసీ దుర్గా ప్రమీళ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్‌లోని నాగోల్ డ్రైవింగ్ ట్రాక్ ఆర్‌టీవోగా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం డీటీసీగా జిల్లాకు బదిలీ చేసింది. కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
అటవీ అధికారులపై ఫిర్యాదు
జైపూర్: కోతుల దాడిలో ఆర్థికంగా, ఆరోగ్యం పరంగా తీవ్రంగా నష్టపోతున్నామని, ఇందుకు కారణమైన అటవీశాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శనివారం భీమారం గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పంటలను నాశనం చేయడమే కాకుండా అడ్డువస్తున్న వారిపై దాడి చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment