వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. తెల్లవారుజామున చలి ప్రభావం ఉంటుంది.
రంజాన్‌కు ఏర్పాట్లు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: రంజాన్ మాసం నేపథ్యంలో జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ముస్లింలు ఉపవాసం ఉండే సమయాల్లో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ జానకీషర్మిలతో కలిసి అధికారులు, ముస్లిం మత పెద్దలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మార్చి 2 నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మసీదుల దగ్గర నిరంతరం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని, ప్రార్థన సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముస్లింల సహాయార్థం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. రంజాన్ పండుగ రోజు ఈద్గాలలో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రార్థనా సమయాల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దుకాణాలు అదనపు సమయాల్లో తెరిచి ఉంచేందుకు అనుమతులు ఇస్తామన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, మైనారిటీ సంక్షేమ అధికారి మోహన్ సింగ్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్, జాదవ్ కృష్ణ, రాజేశ్‌కుమార్, ముస్లిం మత పెద్దలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment