జాతీయస్థాయి నెట్‌బాల్ పోటీలకు ట్రిపుల్‌ఐటీ విద్యార్థి
బాసర: బాసరలోని ఆర్జీయూకేటీ విద్యార్థి కె.వెంకటేశ్ జాతీయస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడని ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్ తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు హర్యానాలోని కలింగలో జరుగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాడని పేర్కొన్నారు. వర్సిటీ విద్యార్థి జాతీయ పోటీలకు ఎంపిక కావడంపై ఇన్‌చార్జి వీసీ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి ఏడుగురు ఎంపిక కాగా, అందులో అందులో ఆర్జీయూకేటీ విద్యార్థి ఉండడం గర్వకారణమని తెలిపారు. అభినందించిన వారిలో స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్‌రావు, ఫిజికల్ డైరెక్టర్ శ్యాంబాబు, పీటీలు ఉన్నారు.
వెంకటేశ్
Comments
Please login to add a commentAdd a comment