● సీఎస్ శాంతికుమారి
నిర్మల్ చైన్‌గేట్: ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలతో బీఆర్.అంబేద్కర్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య, పరీక్ష కేంద్రాల సంఖ్య, పరీక్షల విధులు నిర్వహించే సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష విధులు నిర్వహించే అధికారులందరికీ శిక్షణ ఇవ్వాలని సీఎస్ ఆదేశించా రు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ రుసుంలో 25 శాతం రాయితీని కల్పించినందున మార్చి 31లోగా క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో సమీక్ష చేశారు. మార్చి 5 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ (లే అవుట్ల క్రమబద్ధీకరణ) దరఖాస్తుదారులంతా క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకునేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment