మామడ: అటవీ ప్రాంతంలో జంతువులకు నీ టి వనరుల కొరత లేకుండా చర్యలు చేపట్టా లని బాసర సర్కిల్ సీసీఎఫ్ శర్వానంద్ సూచించారు. బుధవారం మామడ అటవీ క్షేత్ర పరి ధి లోని భీమన్న గుట్ట, ఆరేపల్లి అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీ టికుంటల నిర్మాణం, సాసర్‌పిట్‌లు, నీటిచెల్మ లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. నీటి కుంటల సమీపంలో కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి వనరుల వద్దకు వచ్చే నీలుగాయి, సాంబర్, జింక తదితర అట వీ జంతువులు, పక్షులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎఫ్‌వో నాగినిభాను, ఎఫ్ ఆర్వో రాథోడ్ అవినాశ్, ఎఫ్‌ఎస్వో ప్రభాకర్, ఎఫ్‌బీవోలు రమేశ్, మౌనిక ఉన్నారు.