‘దేవాదాయ’ం.. గాల్లో దీపం!
నిర్మల్: ‘ఆలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని చూస్తున్నారే గానీ.. దేవుడి చుట్టూ ఉన్న సమస్యలు పరిష్కరించడం లేదు..’ అంటూ దేవాదాయశాఖపై బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నా యి. జిల్లాలో పలు ఆలయాల్లో లోపాలను ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో నిత్యం పోస్టులు పెడుతున్నారు. నేరుగా ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారుల నుంచి పెద్దగా స్పందన రావ డం లేదని భక్తులు వాపోతున్నారు. అభివృద్ధి ప నులు, వసతుల కల్పన అటుంచి.. కనీసం కరెంట్, తాగునీరు, అర్చకులు, సిబ్బందికి సకాలంలో వేతనాల విషయం కూడా పట్టించుకోకపోవడంపై వెల్లువలా ఆరోపణలు వస్తున్నాయి.
గండిరామన్నకు కరెంట్ కట్
జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ఒక్కటిగా వె లుగొందుతున్న నిర్మల్‌లోని గండిరామన్న దత్తసాయి ఆలయ ప్రాంగణంలో చీకట్లు ముసురుకున్నాయి. కొన్నినెలలుగా ఆలయం నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ఇటీవల కరెంట్ కట్ చేయడంతో అర్చకులు, సిబ్బంది నివాస గృహాల్లో అంధకారం నెలకొంది. ఊరికి శివారు న, అటవీప్రాంతానికి సమీపంలో ఉండటంతో సంబంధిత కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ గ డిపాయి. అధికారులు, పాలకవర్గం తీరుపై విమర్శలు రావడంతో విద్యుత్ అధికారులతో మాట్లా డి బిల్లులు చెల్లించకుండా, తాత్కాలికంగా కరెంట్ కనెక్షన్‌ను పునరుద్ధరింపజేశారు.
బిల్లులు ఇవ్వకపోవడంతో..
ఆలయాల్లో అభివృద్ధి పనులకు దాతలు ముందు కు వచ్చి డబ్బు, వస్తు రూపంలో సహకరించడం సాధారణమే. వారిచ్చిన వాటితో అక్కడ పాలకవర్గం, అధికారుల సమన్వయంతో పనులు చేయిస్తుంటారు. ఆ పనులు చేసిన వారికి బిల్లుల రూ పంలో డబ్బులు చెల్లిస్తుంటారు. ఇది అంతటా జరిగేదే. కానీ.. గండిరామన్న ఆలయంలో చేసిన పనులకూ బిల్లులు ఇవ్వకపోవడంతో సంబంధిత వ్యక్తులు తాము చేసిన వస్తువులను తిరిగి తీసుకెళ్లడం గమనార్హం. సాయిబాబా ఆలయం పక్కన గల షెడ్డులో గల విగ్రహం వద్ద దాతల సహకా రంతో స్టీల్ రెయిలింగ్‌తో పనులు చేయించారు. ఈ పనులు చేసినవారికి డబ్బులు ఇవ్వకపోవడంతో వారు వాటిని తిరిగి తీసుకెళ్లడం జిల్లాకేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. భక్తులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేయడంతో రెయిలింగ్ పనులు మళ్లీ చేయించారు.
ఇక్కట్లు దేవుడికెరుక
ఏ కష్టం వచ్చినా అందరూ ‘దేవుడా.. నువ్వే ది క్కు..’ అంటుంటారు. అలాంటి ఆలయాల్లో ని త్యం దైవసేవలో ఉండే అర్చకులు, సిబ్బంది స మస్యలు మాత్రం దేవాదాయశాఖ పట్టించుకో వ డం లేదన్న ఆరోపణలున్నాయి. ఆలయాల్లో కాంట్రాక్ట్ సిబ్బంది, అర్చకులకు సకాలంలో వేతనా లు రావడం లేదు. అసలే అరకొరగా ఉన్న జీతా లు నెలలు గడిచినా రాక వారు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఆలయాల్లో భక్తులు ఇచ్చే వస్తుకానుకలనూ అధికారులు వారికి దక్కనివ్వడం లే దన్న ఆరోపణలున్నాయి. ఆలయాల్లో చేసే అన్నదానాల్లోనూ అవకతవకలు చోటుచేసుకుంటున్న ట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తులకు అందించే భోజనానికి, పెట్టే బిల్లులకు పొంతన ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులూ రెగ్యులర్‌గా రావడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. వీటితో పాటు పలు ఆలయాలు శిథిలావస్థకు చేరుతున్నా కనీసం పట్టించుకునేవారు లేరని భక్తులు వాపోతున్నారు.
గండిరామన్న గుడిలో పవర్ కట్
చేసిన పనులకూ చెల్లింపుల్లేవ్
అధికారుల పర్యవేక్షణ అంతంతే
Comments
Please login to add a commentAdd a comment