భైంసాటౌన్: బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ జానకీ షర్మిల అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్‌కుమార్, రూరల్ సీఐ నైలు, ఎస్సై అశోక్, క్యాంప్ ఇన్‌చార్జి రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.
కళ్లను కాపాడుకోవాలి
నిర్మల్: కళ్లను కాపాడుకుంటేనే జీవితాన్ని చూడగలుగుతామని ప్రముఖ కంటివైద్యుడు కృష్ణంరాజు తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఆ దర్శనగర్ శిశుమందిర్‌లో బుధవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వి ద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. డాక్టర్ స తీశ్ చెవి, వినికిడి, మాట పరీక్షలు, డాక్టర్ ప్ర వీణ్ జనరల్ చెకప్ చేసి మందులు అందించా రు. విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువుపై దృష్టిపెట్టాలన్నారు. ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వు పదార్థాల ను కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో శిశుమందిర్ జిల్లా కార్యదర్శి షోలాపూర్ రాజేశ్వర్, శైక్షణిక్ ప్ర ముఖ్ కలిమహంతి వేణుమాధవ్, సాదు జ నార్దన్‌రెడ్డి, పుష్పలత తదితరులున్నారు.
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి
Comments
Please login to add a commentAdd a comment