ఔదార్యం చాటిన విద్యార్థులు
మామడ: ఆపదలో ఉన్న వారికి జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థులు ఆర్థికసాయమందిస్తున్నారు. మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రేని భీమేశ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో మంచానికి పరిమతమయ్యాడు. విషయం తెలుసుకున్న జిల్లా కేంద్రంలోని శ్రీవిద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు విరాళంగా కొంత నగదు సేకరించారు. పోతారం గ్రామానికి వెళ్లి బాధితుడికి నగదు, నిత్యావసరాలు అందించారు. ప్రతీనెల అనాథలు, ఆరోగ్యం బాగాలేని వారికి సాయం అందిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్యాంప్రకాశ్ తెలిపారు.