లెక్కలోకి తీసుకుంటరా..! | - | Sakshi
Sakshi News home page

లెక్కలోకి తీసుకుంటరా..!

Published Wed, Mar 19 2025 12:50 AM | Last Updated on Wed, Mar 19 2025 12:47 AM

లెక్క

లెక్కలోకి తీసుకుంటరా..!

నిర్మల్‌
పిచ్చుకలతో జీవ వైవిధ్యం
జీవ వైవిధ్యంలో పిచ్చుకలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. భూమిపై ప్రతీజీవి మనుగడకు పిచ్చుకలే కారణం. 20న పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
● బడ్జెట్‌లో జిల్లాకు నిధులిస్తారా..! ● ప్రతిసారీ ఆశనిరాశల పద్దులే.. ● ఈసారైనా జిల్లావైపు చూడాలి ● పనులు పూర్తిచేయాలి ● అభివృద్ధికి చేయూతనివ్వాలి

బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025

చెరువుల మరమ్మతులకు నిధులివ్వండి

భైంసాటౌన్‌/ బాసర/ ముధోల్‌: వానాకాలంలో భారీ వర్షాలకు ముధోల్‌ నియోజకవర్గంలో వంద వరకు చెరువులు ధ్వంసమయ్యాయని, మరమ్మతుల కోసం నిధులివ్వాలని ఎమ్మెల్యే పి.రామారావుపటేల్‌ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అసెంబ్లీలో జీరో అవర్‌లో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం భూగర్భజలాలు అడుగంటి పంటలు ఎండుతున్నాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హిప్నెల్లి చెరువు మరమ్మతులకు రూ.60 లక్షలు, దొడర్న చెరువుకు రూ.90 లక్షల నిధులు మంజూరైనా ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ రాలేదని పేర్కొన్నారు. ముధోల్‌ మండలం ఎడ్‌బిడ్‌లో కాంగ్రెస్‌ నాయకులు పంచాయతీరాజ్‌ రోడ్డును వంద మీటర్లు తవ్వేశారని, అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సభ దృష్టికి తెచ్చారు. రోడ్డు నిర్మాణనానికి కలెక్టర్‌ రూ.17.70 లక్షల ఉపాధిహామీ నిధులు మంజూరు చేశారని తెలిపా రు. అయితే వర్షాకాలంలో రోడ్డుపై మొరం వేయించగా రోడ్డు ఎత్తుకు పెరిగిందన్నారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు దీనిని తవ్వించార ని పేర్కొన్నారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ.42 కోట్లు వెనక్కి తీసుకుందని, తిరిగి మంజూరు చేయాలని కోరారు. త్వరలో గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

● రెండుమూడేళ్లుగా భారీ వర్షాలకు చాలావరకు చెరువులు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతుల కోసం నిధులు కేటాయించాలి.

● జిల్లాలో ఇప్పటికీ చాలా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థల్లోనే కొనసాగుతున్నాయి. వీటిపై ఈ బడ్జెట్‌లో దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

కావాల్సినవెన్నో..

● కడెం ప్రాజెక్టుకు గత బడ్జెట్‌లో రూ.9 కోట్లకు పైగా నిధులిచ్చారు. సంబంధిత పనులు పూర్తయ్యాయి. ఇక పూడికతీతతోపాటు పూర్తిస్థాయిలో గేట్లను మార్చాల్సిన అంశంపైనా దృష్టిపెట్టాల్సిన అవసరముంది. ప్రాజెక్టు కాలువలు కూడా చాలాచోట్ల దెబ్బతిన్నాయి. మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది.

● మామడ మండలంలోని కమల్‌కోట్‌ సబ్‌స్టేషన్‌కు భూమిపూజ చేసినా నిధులు మాత్రం విడుదల చేయడం లేదు.

● జిలాకేంద్రంలో పీజీ కళాశాలను తిరిగి రెగ్యులర్‌గా క్లాసులు ఉండేలా ప్రారంభించాలి.

డ్జెట్‌.. అనగానే జిల్లాకు నిధులేమైనా వస్తాయా..!? అన్న ఆసక్తి జిల్లావాసుల్లో ఉంటుంది. కానీ ప్రతీ బడ్జెట్‌కు ముందు ఆశ, ఆ తర్వాత నిరాశ కంటిన్యూ అవుతోంది. ఏళ్లు గడిచిపోతున్నా.. జిల్లా అభివృద్ధికి సరిపడా నిధులు మాత్రం రావడం లేదు. మరోవైపు బాసర దేవస్థానానికి ఇచ్చిన రూ.42 కోట్లనూ సర్కారు వెనక్కి తీసుకుంది. జిల్లాలో రాజకీయ పరిస్థితుల పేరు చెప్పి, ప్రభుత్వాలు ప్రజల సమస్యలపై చిన్నచూపు చూడటం సరికాదన్న వాదనా ఉంది. ఈసారి బడ్జెట్‌లో జిల్లాను లెక్కలోకి తీసుకోవాలని, పెండింగ్‌ పనుల పూర్తితోపాటు కొత్తగా అభివృద్ధి పనులకు దండిగా నిధులు కేటాయించాలని జిల్లా డిమాండ్‌ చేస్తోంది. – నిర్మల్‌

● బాసర ట్రిపుల్‌ఐటీకి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కొన్నేళ్లుగా ప్రతిపాదనలు వెళ్తున్నా.. నిధులు మాత్రం రావడం లేదు. ప్రభుత్వాలు పెద్దగా తమను పట్టించుకోవడం లేదన్న భావన విద్యార్థుల్లో ఉంది.

● కడెం, దస్తురాబాద్‌ మండలాలకు సాగునీటిని అందించేలా లక్ష్మీపూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో సర్వేచేశారు. కానీ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చలనం లేదు.

● సారంగపూర్‌ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు మరమ్మతులకు గతంలో రూ.3 కోట్ల వరకు ప్రతిపాదించినా నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. స్వర్ణనదిలో మంజూరైన చెక్‌డ్యామ్‌లనూ నిర్మించడం లేదు.

● నిర్మల్‌, భైంసా పట్టణాల్లో ట్రాఫిక్‌ పెరిగింది. ఈనేపథ్యంలో ఆయా పట్టణాల్లోనూ ఫ్లైఓవర్‌, రింగ్‌రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఉంది.

● బాసర జ్ఞానసరస్వతీ దేవస్థానానికి గత ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించగా, అందులో కేవలం రూ.8 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా రూ.42 కోట్లు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇప్పటికీ ఆలయ అభివృద్ధికి ఎలాంటి నిధులు, చర్యలు చేపట్టడం లేదు.

● కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో 27, 28 ప్యాకేజీల కింద లక్ష ఎకరాల సాగుకు చేపట్టిన పనులు ఇంకా పూర్తికాలేదు. ప్రధానంగా ముధోల్‌ నియోజకవర్గానికి సంబంధించి 28 ప్యాకేజీ పనులను మధ్యలోనే నిలిపివేశారు. గత ప్రభుత్వం హడావుడిగా 27వ ప్యాకేజీని ప్రారంభించినా.. ఒక్కరోజుకే పరిమితమైంది. ఇప్పటికీ కాలువల పనులు కొనసాగుతూనే ఉన్నాయి.

● నిర్మల్‌ జిల్లాకేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రిలో కార్డియాలజీ సహా అన్నిరకాల వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావాలి. మెడికల్‌ కాలేజీ భవనాన్ని త్వరగా నిర్మించాలి.

● జిల్లాలో ఇప్పటికీ ఒక్క పరిశ్రమ కూడా ప్రారంభం కాలేదు. ఇథనాల్‌, ఆయిల్‌పామ్‌ మధ్యలోనే నిలిచిపోయాయి. బాసరలో ఏర్పాటు చేస్తామన్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ముచ్చట అక్కడే ఆగిపోయింది. అక్కడ భూమి ఉన్నా.. పరిశ్రమలను ఏర్పాటు చేయడం లేదు.

● జిల్లాలో బాసర నుంచి కడెం వరకు జిల్లాకేంద్రం సహా ఎన్నో పర్యాటక ప్రాంతాలు, దర్శనీయ ఆలయాలు ఉన్నాయి. కానీ..ఎక్కడా పర్యాటకపరంగా అభివృద్ధి చేయడం లేదు. కనీసం ఒక్క రూపాయి కూడా పర్యాటకాభివృద్ధి కోసం నిధులు కేటాయించడం లేదు.

● భైంసాలో ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా మార్చడంతోపాటు నూతన భవనాన్ని నిర్మించాలి. అలాగే దేవస్థానంతోపాటు, ట్రిపుల్‌ఐటీని బాసరలో వందపడకలతో ప్రత్యేక ఆస్పత్రిని నిర్మించాల్సిన అవసరం ఉంది.

● నిరుద్యోగ యువతకు సరైన శిక్షణ కేంద్రాలు లేవు. జిల్లాకేంద్రంలో మినహా భైంసా, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో ఆధునాతన లైబ్రరీలు అందుబాటులో లేవు. స్వయం ఉపాధి పొందేందుకూ కనీసం ప్రోత్సాహం లేదు.

● జిల్లాలో క్రీడాప్రాంగణాలు ఉన్నట్లే కానీ.. ఎక్కడా కనీసం ఆడుకోవడానికి సరైన వసతులు లేవు. చాలా క్రీడలకు కోచ్‌లు లేక ఆసక్తి ఉన్న పిల ్లలు పక్కజిల్లాల్లో నేర్చుకోవడానికి వెళ్తున్నారు.

● ఖానాపూర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

న్యూస్‌రీల్‌

రెమ్యునరేషన్‌ చెల్లించాలి

లక్ష్మణచాంద: గత నవంబర్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సర్వేను జిల్లాలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు విజయవంతం చేసి జిల్లాను మొదటి వరుసలో ఉంచారని, అయినా వారికి రెమ్యునరేషన్‌ చెల్లించలేదని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శంకర్‌, అశోక్‌ పేర్కొన్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వెంటనే రెమ్యునరేషన్‌ విడుదల చేయాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
లెక్కలోకి తీసుకుంటరా..! 1
1/1

లెక్కలోకి తీసుకుంటరా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement