భవన నిర్మాణ కార్మికులకు వర్క్‌షాప్
నిర్మల్‌ఖిల్లా: జిల్లాలో భవన నిర్మాణరంగం కార్మికులకు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కల్పించాలని పలువురు కార్మిక సంఘ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జాతీయ భవన నిర్మాణం అకాడమీ, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆరు రోజుల వర్క్‌షాప్‌ను మంగళవారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా గృహ నిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రవాసీమిత్ర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల మాట్లాడుతూ.. భవన నిర్మాణరంగంలో స్థానిక మేసీ్త్రలు, కార్మికులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో అవకాశం కల్పించాలని సూచించారు. స్థానిక కార్మికులు, మేసీ్త్రలకు నైపుణ్య శిక్షణ అందిస్తూ తక్కువ ఖర్చుతో స్థానిక వనరులను వినియోగించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను చేపట్టవచ్చని సూచించారు. మరో అతిథి అసిస్టెంట్ ఇంజనీర్ హెచ్‌ఏ.షరీఫ్ మాట్లాడుతూ.. స్థానిక కార్మికులకు శిక్షణ ద్వారా నిర్మాణ కొలతలు, మౌలిక ఇంజనీరింగ్ సామర్థ్యాలను నేర్చుకుని న్యాక్ సంస్థ ద్వారా ధ్రువీకరణ పత్రం పొందితే భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు రమేశ్, మహేశ్, జిల్లాకు చెందిన పలువురు మేసీ్త్రలు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరికీ టీషర్టులు, బ్యాగులు, హెల్మెట్‌లు అందించారు.
జాతీయ నిర్మాణ సంస్థ, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు
Comments
Please login to add a commentAdd a comment