పీఎంశ్రీతో ఐసీడీఎస్ నిర్వీర్యం
● సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్ ● రెండో రోజు కొనసాగిన అంగన్‌వాడీల ఆందోళన
నిర్మల్‌చైన్‌గేట్: ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే పీఎంశ్రీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు తలపెట్టిన 48 గంటల మహాధర్నా రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో అంగన్‌వాడీలు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి సామూహిక భోజనాలు చేశారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టరేట్ ప్రాంగణంలో బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొమ్మెన సురేశ్ మాట్లాడుతూ అంగన్‌వాడీ టీచర్లకు ప్రతీనెల ఒకటో తారీకు జీతాలు, ఎండాకాలంలో మే నెల మొత్తం సెలవులు ప్రకటించాలన్నారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రవర్తిస్తుందన్నారు. ఐసీడీఎస్‌కు వ్యతిరేకంగా కేంద్రం చేసిన నిర్ణయాలకు రాష్ట్రంలో అమలు చేయాలని చూడడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయంతో పేద ప్రజలకు, అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు తీవ్రమైన నష్టం కలిగించాయన్నారు. ఎన్‌ఈపీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. మొబైల్ అంగన్‌వాడీ సెంటర్ రద్దుచేసి ఐసీడీ సేవలు పాత పద్ధతిలో కొనసాగించాలని కోరారు. అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ కు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం పర్మిట్ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టో పొందుపర్చిన హామీల ప్రకారం మినీ టీచర్ నుంచి మెయిన్ టీచర్‌గా పదోన్నతి పొందిన అంగన్‌వాడీ టీచర్లకు పది నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూని యన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లలిత, జిల్లా కోశాధికారి శైలజ, జిల్లా ఉపాధ్యక్షులు గంగామణి, రజియా విజయ, ప్రసాద, భాగ్య,వనజ, జిల్లా సహాయ కార్యదర్శి, భాగ్య, రేష్మ, విజయ, వందన, దేవిక లావణ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు.
పీఎంశ్రీతో ఐసీడీఎస్ నిర్వీర్యం
Comments
Please login to add a commentAdd a comment