
కలెక్టర్ ఆదేశించినా సాగునీరివ్వరా?
కడెం: పక్క నుంచే సాగునీరు వెళ్తున్న మళ్లించుకోలేని దుస్థితిలో మండలంలోని సదర్‌మాట్ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే సాగు నీరందక కొందరి పొలాలు ఎండడంతో కలెక్టర్ అభిలాష అభినవ్ వాటిని పరిశీలించారు. ఏప్రి ల్ చివరి వరకు సదర్‌మాట్ చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మండలంలోని లింగాపూర్, నచ్చన్‌ఎల్లాపూర్, మాసాయిపేట్, కొత్తమద్దిపడగ, పాత మద్ది పడగ తదితర గ్రామాలకు సదర్‌మాట్ కాలువ ద్వా రా వారబందీ పద్ధతిన సాగు నీరందించాలి. కానీ, ఒక్కరోజు మాత్రమే నీటిని అందిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. సదరమాట్ కాలువ ద్వారా కడెం ప్రాజెక్ట్‌కు ఫీడింగ్ చేయడంతో తమకు అన్యాయం జరుగుతోందని కొత్తమద్దిపడగ, పెద్దూర్‌తండా రై తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి సాగునీరందించాలని కోరుతున్నారు.