నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో ప్రత్యేక వైకల్య గుర్తింపు కా ర్డుల(యూడీఐడీ కార్డుల) పంపిణీ కోసం అర్హుల ఎంపికకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. హైదరా బాదు నుంచి సె ర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, పంచాయతీరాజ్ గ్రా మీణాభివృద్ధి సెక్రెటరీ లోకేష్ కుమార్‌తో కలిసి జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో యూడీఐడీ కా ర్డులు, ఇందిర మహిళా శక్తి పెట్రోల్ బంకుల ఏ ర్పాటు, ప్రమాద బీమా మంజూరు, ఏకరూప దుస్తుల తయారీ తదితర అంశాలపై వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెర్ప్ సీఈవో మా ట్లాడుతూ, అన్ని జిల్లాల్లో ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులను జారీ చేసేందుకు గుర్తింపు ప్రక్రియ ప్రా రంభించాలన్నారు. దివ్యాంగులు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వి ద్యాసంస్థల్లో చదివే వి ద్యార్థులకు ఏకరూప దుస్తుల ను పంపిణీ చేసేందుకు, ఎస్‌హెచ్‌జీ సభ్యులతో ఏకరూప దుస్తు ల స్ట్రిచింగ్ ప్రారంభించాలన్నారు. ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ బంకులు, విద్యుత్ వాహనాల చార్జింగ్ కేంద్రాలు, మహిళాశక్తి బజార్‌ల ఏ ర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. ప్ర మాదవశాత్తు మరణించిన మహిళా సంఘాల స భ్యులకు బీమా డబ్బులు అందేలా చూడాలన్నారు.
ఎంపిక ప్రారంభానికి..
కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ యూ డీఐడీ కార్డుల మంజూరు కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే న మోదు చేసుకున్న దివ్యాంగులకు సమాచారం అందించి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో యూడీఐడీ కార్డుల నమోదు శిబిరాన్ని ఏర్పా టు చేయనున్నామన్నారు. సందేహాల నివృత్తికి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామ ని, మహిళా శక్తి పెట్రోల్ బంకులు, విద్యుత్ వాహనాల చార్జింగ్ కేంద్రాలు, ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలా లను గుర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఇందిరా మహిళా బజార్ ఏర్పాటు కు స్థల గుర్తింపు పూర్తయిందని, ఇందిరా మహిళా బజార్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఇన్‌చార్జి డీఆర్డీవో శ్రీనివాస్, మెప్మా పీడీ సుభాష్, డీఎస్‌ఓ కిరణ్‌కుమార్, సివిల్ సప్లయిస్ డీఎం వేణుగోపాల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు
సెర్స్ సీఈవో దివ్యదేవరాజన్