
ఇక సులువుగా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు
● 15 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి ● సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు ● నిర్మల్‌లో నేటి నుంచి ప్రారంభం
నిర్మల్‌చైన్‌గేట్: స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు మరింత సులు వు కానున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ద స్తావేజుల నమోదు కోసం గంటల తరబడి నిరీక్షించే పనిలేకుండా 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. రిజిస్ట్రేషన్ల శాఖ సరి కొత్త సంస్కరణల్లో భాగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలుకు సిద్ధమైంది. మొదటి దశలో ప్రయోగాత్మకంగా జిల్లాలోని నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలు కానుంది. స్లాట్ బుకింగ్ విధానం అమలుకు రిజిస్ట్రేషన్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
రోజుకు కనీసం 48 స్లాట్లు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ల కోసం అందించడంతో జరిగే జాప్యాన్ని నివారించడానికి సబ్–రిజిస్ట్రార్ కార్యాలయానికి రోజువారీ పని వేళలను కనీసం 48 స్లాట్లుగా కేటాయిస్తారు. దస్తావేజు దారులు నేరుగా https:// registration. tela ngana. gov. in ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ స్లా ట్ బుకింగ్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్ పూర్తిగా 10–15 నిమిషాల్లోనే పూర్తికానుంది. ఫలితంగా క్రయవిక్రయదారులకు ఎంతో సమయం కలిసిరానుంది.
స్లాట్ బుకింగ్ లేకున్నా ఐదింటికీ..
స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి వచ్చిన తర్వా త కూడా స్లాట్ బుకింగ్ చేసుకోని వారిని విస్మరించొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. స్లాట్ బుకింగ్ చే సుకోని ఐదు డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ప్రతీరోజు సాయంత్రం 5నుంచి 6గంటల వరకు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లకు అనుమతి ఉంటుంది. అప్పటికే సిద్ధం చేసుకున్న డాక్యుమెంట్లతో క్రయవిక్రయదారులు నేరుగా కార్యాలయానికి చేరుకుంటే ఐదు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు.
త్వరలోనే ఆధార్ ఈ–సంతకం
ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరిగే సమయంలో ఆయా ఆస్తులకు సంబంధించి అమ్మినవారు, కొనుగోలు చేసేవారు కార్యాలయాలకు వెళ్లి వ్యక్తిగతంగా సంతకాలు చేయాల్సిన విధానం ఉంది. ఈ సంతకాలు చేసే క్రమంలో చాలా సమయం పడుతుండడంతో దస్తావేజుల ప్రక్రియ ఆలస్యమవుతోంది. సమ యం వృథాను నివారించడంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఆధార్ ఈ–సంతకం విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. త్వరలోనే విదివిధానాలు ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
సమయం ఆదా అవుతుంది
రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద స్లాట్ బుకింగ్ విధానంలో నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎంపిక చేసింది. ఈ విధానం ద్వారా క్రయవిక్రయదారులకు రిజిస్ట్రేషన్ సమయం ఆదా అవుతుంది. దీనికి తోడు డబుల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది జరగదు.
– రవికిరణ్, సబ్ రిజిస్ట్రార్, నిర్మల్

ఇక సులువుగా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు

ఇక సులువుగా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు