
అర్ధశతాబ్దపు ఆత్మీయ సమ్మేళనం!
వారు 1975–76లో సోమవార్‌పేట బాలికల ఉన్న త పాఠశాలలో పదో తరగతి చదివిన విద్యార్థులు. వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. కొంతమంది రిటైర్ కూడా అయ్యారు. అర్ధ శతాబ్దం తర్వాత తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కలుసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో వారికోసం ఆరా తీశారు. చిరునామా తెలుసుకుని వారి ఇంటికి వచ్చారు. పూర్వ విద్యార్థులంతా వారంతా గురువారం ద్యాగవాడలో ఒక్కచోట కలిశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు నరసమ్మ, మలా మీనన్(సుమారు 90 ఏళ్లు)ను ఆత్మీయంగా సత్కరించారు. పాదాభివందనం చేశారు. ఇందులో పూర్వ విద్యార్థులు సుజాత దేవి, జయశ్రీ, భాగ్యలక్ష్మి, వీణ, కవిత, కృష్ణకుమారి, సుజాత, హేమలత, సునీత, ప్రభలత, శోభ, ఇందుమతి, మాయ, రత్నమాల తదితరులు పాల్గొన్నారు. – నిర్మల్‌ఖిల్లా

అర్ధశతాబ్దపు ఆత్మీయ సమ్మేళనం!

అర్ధశతాబ్దపు ఆత్మీయ సమ్మేళనం!