
రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం
లోకేశ్వరం: మండలంలోని రాజూర గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు పతాని నడ్పి మల్లన్న కుటుంబాన్ని ఆదుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ తెలిపారు. బాధిత కుటుంబాన్ని లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్‌తో కలిసి గురువారం పరామర్శించారు. ఆత్మహత్యకు కారణాలు అడిగి తెలు సుకున్నారు. అంతకుముందు మల్లన్న వ్యవసాయా భూమిలో వేసి న బోర్లను పరిశీలించారు. రైతు చేసిన అప్పులు గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలు సుకున్నారు. ప్రైవే టు వ్యక్తులు, బ్యాంకులో ఎంత మేరకు అప్పులు ఉన్నయని ఖాతాల ను పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. వారివెంట ము ధోల్ సీఐ మల్లేశ్, ఎస్సై అశోక్, ఏసీవో మౌనిక ఉన్నారు.