
ఉపాధ్యాయులు నిర్మాణాత్మక పాత్ర పోషించాలి
నిర్మల్ రూరల్: సమాజంలో ఉపాధ్యాయులు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని డీఈవో రామారావు అన్నారు. త్వరలో ఉద్యోగ విరమణ పొందనున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు అనుముల కమలాకర్‌రావు, పెంట శంకర్, కృష్ణారావు, పద్మలత, ప్రభకుమారి, శ్రీనివాస్‌ను సెయింట్ థామస్ పాఠశాలలో మంగళవారం సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. ఇందులో జిల్లా సోషల్ ఫోరం ప్రధాన కార్యదర్శి భూషణ్, ఆర్థిక కార్యదర్శి ఆంజనేయులు, గౌరవాధ్యక్షుడు నారాయణరెడ్డి, మధు, ఏసీజీ పరమేశ్వర్, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ రమణారెడ్డి పాల్గొన్నారు.