
సమయపాలన పాటించకుంటే చర్యలు
● డీఈవో రామారావు
లక్ష్మణచాంద/సోన్: సమయ పాలన పాటించకుంటే చర్యలు తప్పవని డీఈవో రామారావు ఉపాధ్యాయులను హెచ్చరించారు. లక్ష్మణచాంద, సోన్ మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను శనివారం తనిఖీ చేశారు. ధర్మారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిశుభ్రంగా ఉండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 23న పాఠశాలల్లో నిర్వహించే తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వాలన్నారు. అనంతరం మండలంలోని పార్‌పెల్లి ప్రభుత్వ ఉన్న త పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయుల రిజిస్టర్‌ను పరిశీలించారు. ప్రమోద్ అనే ఉపాధ్యాయుడు సమయాని కన్నా ముందుగానే వెళ్లడంతో ఉపాధ్యాయుడి వివరాలు అడిగారు. అనారోగ్యం కారణంగా తన అనుమతితోనే వెళ్లాడని ప్రధానోపాధ్యాయుడు మోహన్ సమాధానం తెలిపారు. రిజిస్టర్‌లో వివరాలు ఎందుకు లేవని హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్టాఫ్ మీటింగ్ పెట్టి పాఠశాల అభివృద్ధికి చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అదే సముదాయంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సమయానికన్నా ముందు వెళ్లడంతో హెచ్‌ఎం ముత్తన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై క్లస్టర్ ప్రధానోపాధ్యాయుడిని వివరణ తీసుకోవాలని సూచించారు. జిల్లాలోనే సోన్ ఉన్నత పాఠశాల మొద టి ఆంగ్ల మాధ్యమ పాఠశాలగా కొనసాగుతుందని అన్నారు. ఇక్కడ విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయబడ్డారని పేర్కొన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల చేరికను పెంచా లని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో పరమేశ్వర్, హెచ్‌ఎం ఆరాధన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.