
గజ్జలమ్మ దేవికి పూజలు
కుంటాల: మండల కేంద్రంలోని గజ్జలమ్మదేవి ఆలయంలో ఆదివారం ప్రత్యేకపూజలు నిర్వహించారు. గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లకు అభిషేకం, అలంకరణ, అర్చ న, హారతి నిర్వహించారు. అనంతరం నిర్వ హించిన పల్లకీ సేవలో భక్తులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని ముంబై, నాందేడ్, ధర్మాబాద్, బోకర్, ఇస్లాపూర్ హిమాయత్‌నగర్, అప్పారా వుపేట్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధి కసంఖ్యలో వచ్చారు. తలనీలాలు, ఎత్తు బంగారం (బెల్లం), బోనాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు.