నిజామాబాద్: బాలలపై లైంగిక వేధింపులు, దాడులు నిరోధించడానికి వీలుగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నదని సంస్థ చైర్‌పర్సన్, జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. పోక్సోచట్టంపై లఘుచిత్రం చిత్రీకరణ సందర్భంగా జిల్లాకోర్టు ఆవరణలోని న్యాయసేవ సదన్‌లో ఆమె సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సలహాదారు సాయిప్రసాద్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ప్రజల్లో పొక్సో చట్టంపై విస్తృత అవగాహన కల్పించడానికి దశ్యమాధ్యమ లఘుచిత్రం చిత్రీకరణ జరుగుతుందని వివరించారు. 18 ఏళ్ల లోపు బాలల పురోభివద్ధికి అన్ని ప్రభుత్వ, ప్రైవే టు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం తోడ్పాటు, సహకారం అందించాలని ఆమె కోరారు. నేటి ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్లు విరివిగా వినియోగిస్తు న్నారని వాటిలో లఘుచిత్రం ప్రసారం వలన ప్రజ ల్లో పోక్సోచట్టంపై చైతన్యం కలుగుతుందన్నారు.
సినిమా థియేటర్లు, లోకల్ చానళ్లలో కూడా లఘుచిత్రం ప్రసారం చేయడానికి ప్రణాళికలు ఉన్నాయన్నారు. బాలలపై జరుగుతున్న లైంగిక హింసకు సంబంధించిన క్రిమినల్ కేసులను విచారించడానికి జిల్లాకోర్టు ప్రాంగణంలో ప్రత్యేక పోక్సో కోర్టు తన విధులను నిర్వహిస్తున్న విషయం జిల్లా ప్రజలకు ఎరుకనేనని ఆమె గుర్తుచేశారు. న్యాయ విచారణకు హాజరయ్యే బాధితులకు ప్రత్యేక వసతి సౌకర్యాలు ఉన్నాయని ఒక స్నేహపూర్వక వాతావరణంలో నేరన్యాయ విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.
పోక్సో కేసుల్లో బాధితులకు న్యాయసేవా సంస్థ తగిన పరిహారం అందిస్తుందన్నారు. సమావేశంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ యెండల ప్రదీప్, న్యాయసేవ సంస్థ న్యాయవాదులు జగన్ మోహన్ గౌడ్, మానిక్ రాజు, సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment