నిజామాబాద్: నగరంలో రాములు (పేరుమార్చాం)అనే వ్యక్తి తనకు సంబంధించిన డివిజన్ కార్పొరేటర్ వద్దకు వెళ్లి దళిత బంధు విషయంపై విన్నవించుకున్నారు. సదరు కార్పొరేటర్ నాకు రూ. 7 లక్షలు, నీకు రూ. 3 లక్షలు అయితేనే నీ పేరు జాబితాలో పెట్టిస్తానన్నాడు. ఇదేం బాగోలేదని మరో కీలక నాయకుడిని సంప్రదిస్తే నీకు రూ. 5 లక్షలు, నాకు రూ. 5 లక్షలు అని ఒప్పందం చేసుకున్నాడు. నీవు ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి అని దబాయించాడు సదరు నాయకుడు. దీంతో ఏమీ చేయలేని స్థితిలో రాములు సరేనన్నాడు. ఇలా దళితబంధు విషయంలో నగరంలో కమీషన్ దందా నడుస్తోంది.
నిజామాబాద్ నగరంలో ప్రజాప్రతినిధి ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి అంగీకారం తెలిపినప్పటికీ షాడోబాస్ కూడా ఓకే చెప్పాల్సిందే.. లేకపోతే ఆ పని అక్కడే ఆగిపోతుంది. ప్రస్తుతం ఈ సంఘటనలు నగరంలో చర్చనీ యాంశంగా మారాయి. ముఖ్యంగా దళిత బంధు రెండో విడత అర్హుల జాబితా అంతా ప్రజాప్రతినిధి వెనక షాడో వ్యక్తి కనుసన్నల్లోనే జరిగింది.
తన సీక్రెట్ ఏజెంట్ల ద్వారా ముందస్తుగానే పెద్ద ఎత్తున లక్షల్లో ముడుపుల బాగోతాన్ని నడిపించాడని చర్చించుకుంటున్నారు. ఎవరు ఎంత మొత్తంలో కమీషన్ ఇచ్చారో లెక్కరాసుకుని మరీ జాబితాను సిద్ధం చేశారని వినికిడి. 1100 మందితో కూడిన దళితబంధు రెండో జాబితాలో సుమారు 1000 మందికి పైగా లబ్ధిదారుల నుంచి ముందస్తుగా కమీషన్లు తీసుకున్నాకే పేర్లు నమోదు చేశారని సమాచారం.
రూ. 30 కోట్లకు పైనే..
దళితబంధు రెండో విడత డబ్బులు రిలీజ్ కాకముందే సదరు ప్రజాప్రతినిధి వద్ద ఉండే షాడో వ్యక్తి తన సీక్రెట్ ఏజెంట్లతో కమీషన్‌లు వసూళ్లు చేసేశారు. దళితబంధు కింద లబ్ధిదారుడికి రూ.10లక్షలు వ స్తుండగా ముందుగానే ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ. 3 లక్షలు, మరీ అమాయకులైతే రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇందులో మాజీ డివిజన్ ప్రజాప్రతినిధులకే కాకుండా, ప్ర స్తుత డివిజన్ ప్రజాప్రతినిధులు కూడా తమవారి పేర్లు దళితబంధు లిస్ట్‌లో చేర్చేందుకు షాడోకు ముందుగానే కమీషన్లు ఇచ్చేశారు. మొదటి విడతలో 100 మంది లబ్ధిదారుల్లో రూ. 3 కోట్ల వరకు వసూలు చేస్తే, రెండో విడత 1100 మంది లబ్ధిదారుల వద్ద సుమారు రూ. 30 కోట్లకు పైనే వసూళ్లు చేశారని అధికార పార్టీ నాయకులే చర్చించుకోవడం గమనార్హం. ప్రజాప్రతినిధికి షాడోనే పక్కనుంచి మచ్చతెస్తున్నా గుర్తించలేకపోతున్నాడని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
ముందుగానే డబ్బులు..
సదరు ప్రజాప్రతినిధికి మచ్చ తెస్తున్న షాడో వ్యక్తి ఈసారి నేరుగా కాకుండా సీక్రెట్ ఏజెంట్ల వ్యవస్థను తయారు చేసుకున్నా డు. తనకు అత్యంత నమ్మకంగా ఉండే వ్యక్తుల ను తయారు చేసుకున్నారు. వారితోనే నగరంలోని ఆయా డివిజన్లలో దళిత బంధు రెండో వి డత జాబితాను రూపొందించారు. సీక్రెట్ ఏజెంట్లు కూడా షాడో పేరు బయటకు రాకుండా క్షేత్రస్థాయిలో దళితబంధు బాగోతాన్ని చక్కబెడుతున్నారు.
దళితబంధు కా వాలంటే లబ్ధిదారుడితో కమీషన్‌ను ముందే మాట్లాడుకుని వసూళ్లు చేశారు. రెండు నెలలుగా ఈ సీక్రెట్ ఏజెంట్లు, షాడో వ్యక్తికి మధ్య దళితబంధు విషయంలో రూ. కోట్లల్లో వ్యవహారం నడిచిందని వినికిడి. సీక్రెట్ ఏజెంట్లతో పాటు ఇద్దరు, ముగ్గురు నాయకులు, సదరు పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జీలు సైతం షాడో గ్రూప్‌లో ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment