మరమ్మతులతో మరింత పాడైన రోడ్డు
గాంధారి(ఎల్లారెడ్డి): మరమ్మతుల పేరుతో గాంధారి–బాన్సువాడ ప్రధాన రహదారిని మరింత చెడగొట్టారు. రోడ్డు పాడైపోయి అక్కడక్కడా గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డుకు వారం రోజుల క్రితం విచిత్రమైన మరమ్మతులు చేశారు. దీంతో ప్రయాణికులకు మరింత ఇబ్బంది కలుగుతోంది. మరమ్మతుల్లో భాగంగా చిన్నగా ఉన్న గుంతలను పొక్లెయిన్‌తో మరింత వెడల్పు, లోతు తీశారు. గుంతల్లో దొడ్డు కంకర వేసి వదిలేశారు. దీంతో వాహన రాకపోకలకు వేసిన కంకర, బాగున్న తారు రోడ్డుపై కొంత, పక్కలకు కొంత ఎగిరిపోయింది. రోడ్డుపై కంకర ముక్కల కారణంగా పలు ద్విచక్ర వాహనా లు అదుపు తప్పి పడిపోతున్నాయి. పెద్ద వాహ నాలు వెళ్లినప్పుడు కంకర ముక్కలు ఎగిరి పక్కను న్న వారికి తగులుతున్నాయి. మొత్తం కంకర ఎగిరిపోయిన చోట పొక్లెయిన్‌తో తీసిన గుంతలు లోతు కావడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సంబంధిత అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment