విద్యుత్ సరఫరాలో సిబ్బంది పాత్ర కీలకం
సుభాష్‌నగర్: విద్యుత్ సరఫరాలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే లైన్‌మన్లు, ఆర్టిజన్, ఆన్ మ్యాన్, జేఎల్‌ఎం, ఎల్‌ఐ, ఎస్‌ఎల్‌ఐల పాత్ర కీలకమని డిచ్‌పల్లి డీఈ ఉత్తమ్ జాడే పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని పవర్‌హౌస్ సమావేశపు హాల్‌లో లైన్‌మన్ దివస్ సందర్భంగా క్షేత్రస్థాయి సిబ్బంది సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఈ మాట్లాడుతూ.. ఎన్‌పీడీసీఎల్‌లో క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది సేవలు అమోఘమని కొనియాడారు. సభాధ్యక్షుడు నిజామాబాద్ రూరల్ ఏడీఈ రెంజర్ల బాలేశ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్‌పీడీసీఎల్ లక్ష్య సాధనలో క్షేత్రస్థాయి సబ్బంది పాత్ర కీలకమని, ఎంతో జాగ్రత్తతో పనులు చేపట్టాలని సూచించారు. కార్యర కమంలో ఏఈలు రాజేందర్, శ్రీనివాస్, నాగ శర్వాణి, భాస్కర్, శంకర్ గౌడ్, ప్రవీణ్‌కుమార్, సబ్ ఇంజినీర్ కుమారి దివ్య, భరత్, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మన్లు, అసిస్టెంట్ లైన్‌మన్లు, జూనియర్ లైన్‌మన్లు, ఆర్టిజన్లు, ఆన్‌మ్యాన్ కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment