భీమ్‌గల్‌లో మితంగానే ఖర్చులు
మోర్తాడ్(బాల్కొండ): భీమ్‌గల్ మున్సిపాలిటీ లో చెత్త సేకరణకు మూడు ట్రాక్టర్లు, రెండు ట్రా లీ ఆటోలను వినియోగిస్తున్నారు. గ్రామ పంచాయతీగా ఉన్న భీమ్‌గల్ పట్టణాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. అప్‌గ్రేడ్ కాక ముందే చె త్త సేకరణ కోసం రెండు ట్రాక్టర్లను వినియోగించారు. జీపీ నిధులతోనే వీటిని కొనుగోలు చేయ డం గమనార్హం. మున్సిపాలిటీగా మారిన తరువాత మరో ట్రాక్టర్‌తోపాటు మూడు ట్రాలీ ఆటోలను కొనుగోలు చేశారు. ఒక ఆటో రిపేర్ చే యించాల్సి ఉంది. ప్రస్తుతానికి మూడు ట్రాక్టర్లు, రెండు ట్రాలీ ఆటోలతో చెత్త సేకరిస్తున్నారు.
40 మోటార్లు..
మిషన్ భగీరథ నీరు ఇంటింటికి అందక ముందు 40 మోటార్లతో నీటి సరఫరాను కొనసాగించారు. ఇంటింటికి నీరు సరఫరా అవుతుండటంతో కేవలం ఆరు మోటార్లను అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నారు. మరో ఆరు చేతి పంపులు అక్కడక్కడ ఉన్నాయి. వీటిని మున్సిపాలిటీ నిధులతోనే నిర్వహిస్తున్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి ఏర్పడితే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని మున్సిపాలిటీ అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment