రోడ్డెక్కిన పసుపు రైతులు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన పసుపు రైతులు

Published Tue, Mar 11 2025 1:39 AM | Last Updated on Tue, Mar 11 2025 1:38 AM

రోడ్డ

రోడ్డెక్కిన పసుపు రైతులు

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పసుపు కొనడం లేదని రైతులు రోడ్డెక్కారు. ప్రధాన బస్టాండ్‌ ఎదుట ధర్నాకు దిగారు. సోమవారం శ్రద్ధానంద్‌ గంజ్‌కు 39 వేల బస్తాల పసుపు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసు పు ధర తగ్గడంతో పంట కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. మధ్యాహ్నం కావస్తున్నా వ్యాపారులు ధర కోడ్‌ చేయడానికి రాకపోవడంతో రైతులు మార్కెట్‌ కమిటీ కార్యాలయం వద్ద కు చేరుకున్నారు. పసుపును ఎందుకు కొనుగోలు చేయడం లేదని అధికారులు, సిబ్బందిని నిలదీయగా, వారి నుంచి సరైన సమాధానం రాలేదు. కోపోద్రిక్తులైన రైతులు మార్కెట్‌యార్డు నుంచి ర్యా లీగా నగరంలోని ప్రధాన బస్టాండ్‌ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. సుమారు గంటకుపైగా ధర్నా చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

● అంతర్జాతీయ మార్కెట్‌లో 45 రోజుల క్రితం పసుపు ధర క్వింటాలుకు రూ.15,200 ఉండగా, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ క్వింటాలుకు కటాఫ్‌ ధర రూ.10 వేలుగా నిర్ణయించింది. ఈ మేరకు కొనుగోళ్లు జరిగేవి. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో కొన్నిరోజులుగా పసుపు ధర తగ్గుతూ ప్రస్తుతం క్వింటాలుకు రూ.11,500 పలికింది. మార్కెట్‌ కమిటీ నిర్ణయించిన కటాఫ్‌ ధర తగ్గించాలని వ్యాపారులు కోరారు. రైతుల సంక్షేమం దృష్ట్యా కటాఫ్‌ ధర తగ్గించేందుకు మార్కెట్‌ కమిటీ అంగీకరించలేదు. దీంతో రైతులు తీసుకొచ్చిన పంటకు వ్యాపారులు ధర కోడ్‌ చేయడానికి ముందుకు రాలేదు. రైతులు ఆందోళన చెంది ధర్నాకు దిగారు.

రైతులతో చర్చలు..

ధర్నా విరమించిన అనంతరం అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌, నిజామాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, నిజామాబాద్‌ ఆర్డీవో రాజేంద్రకుమార్‌, ఏసీపీ రాజా వెంకట రెడ్డి, సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ అపర్ణ, డీఎంవో గంగు సమక్షంలో వ్యాపారులు, రైతులతో మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో చర్చ లు జరిపారు. అంతర్జాతీయంగా ధర తగ్గిందని కటాఫ్‌ ధర తగ్గించాలని వ్యాపారులు అధికారుల తో పేర్కొన్నారు. ధర తగ్గిస్తే ఊరుకోబోమని, మద్ద తు ధర ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు. అధికారులు జోక్యం చేసుకుని కటాఫ్‌ ధరను పసుపు కాడికి రూ.9,500, గోలకు రూ.8 వేలుగా వ్యాపారులు, రైతుల సమక్షంలో నిర్ణయించారు. అందరూ సమ్మతం తెలపడంతో చర్చలు సఫలమయ్యాయి.

అదనపు కలెక్టర్‌

హామీతో విరమణ

ప్రధాన బస్టాండ్‌ ఎదుట రైతుల ధర్నా విష యం తెలుసుకున్న ఏసీపీ రాజా వెంకట రెడ్డి అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మార్కెట్‌యార్డులో వ్యా పారులు సిండికేట్‌ అయ్యారని, పసుపు ధర తగ్గిస్తున్నారని, పంటను కొనడం లేదని రైతు లు ఆరోపించారు. కలెక్టర్‌ వచ్చి హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ వచ్చి హామీనివ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.

ఎండిన పసుపు తేవాలి..

రైతుల సంక్షేమానికి మార్కెటింగ్‌ శాఖ, ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతులు పచ్చి పసుపు తీసుకురావొద్దు. ఎండిన పసుపు తెచ్చి మంచి ధర పొందాలి. కొందరు రైతులు పచ్చి పసుపు తేవడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులు, వ్యాపారులు, అధికారుల సమక్షంలో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. మంగళవారం నుంచి యథావిధిగా పసుపు క్రయవిక్రయాలు జరుగుతాయి.

– ముప్ప గంగారెడ్డి, చైర్మన్‌

నిజామాబాద్‌ మార్కెట్‌లో పంట

కొనుగోలు చేయాలని ధర్నా

అంతర్జాతీయ మార్కెట్‌లో ధర తగ్గడంతో కొనడానికి ముందుకు రాని వ్యాపారులు

నగరంలోని బస్టాండ్‌ ఎదుట రైతుల

ఆందోళనతో ట్రాఫిక్‌కు అంతరాయం..

వ్యాపారులు, రైతులతో అధికారులు

జరిపిన చర్చలు సఫలం

నేటి నుంచి యథావిధిగా

మార్కెట్‌లో పసుపు కొనుగోళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment
రోడ్డెక్కిన పసుపు రైతులు 1
1/2

రోడ్డెక్కిన పసుపు రైతులు

రోడ్డెక్కిన పసుపు రైతులు 2
2/2

రోడ్డెక్కిన పసుపు రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement