చివరాయకట్టు వరకు నీరందించాలి
నిజామాబాద్ అర్బన్: చేతికొచ్చిన పంటలను కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి విషయంలో నీటిపారుదల శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు వాస్తవాలను వివరించాలని సూ చించారు. సోమవారం సాయంత్రం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతికుమారితో కలిసి ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మరో 15 రోజుల్లో పంటలు చేతికి రానున్నందున అధికారులు సమన్వయంతో రైతాంగానికి తోడ్పాటునందించాలని సూచించారు. చివ రాయకట్టు వరకు సాగునీరందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో నిజనిజాలు తెలుసుకోకుండా పంట నష్టంపై జరుగుతున్న ప్రచారం సత్య దూరమన్నారు.
వనరులను సద్వినియోగం చేసుకుంటాం
జిల్లాలో యాసంగి పంటల పరిస్థితిని నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. ప్రధానంగా వరి పంట కోసం చివరి ఆయకట్టు వరకు సాగు నీరందేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో మొత్తం 4.19 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేశారని మంత్రుల దృష్టికి తెచ్చారు. 2.38లక్షల ఎకరాలు చెరువులు, కాలువల కింద సాగు చేయడంతో ఎలాంటి ఇబ్బందుల్లేవని తెలిపారు. బోరుబావులపై ఆధారపడి మరో లక్షా 80వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారని, భూగర్భ జలాలు కొంతమేర తగ్గడంతో భీమ్‌గల్, ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి, డిచ్‌పల్లి, మోపాల్ మండలాల్లో సుమారు 1100 ఎకరాలకు సాగునీటి కొరత నెలకొందని అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సాగునీటిని అందించి పంటలు కాపాడుకునేలా అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటామని అన్నారు. వీసీలో సీపీ సాయి చైతన్య, అధికారులు పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో
పని చేయాలి
వీసీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్,
తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment