
మూలకు చేరిన 14 ఆటోలు
బోధన్ టౌన్ : బోధన్ మున్సిపాలిటీ పరిధిలో రెండుమూడు రోజులకోసారి చెత్త సేకరిస్తుండడంతో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మా రింది. మున్సిపాలిటీ పరిధిలో 38 వార్డులు, లక్షలకు పైగా జనాభా ఉంది. పారిశుధ్య విభాగంలో 182 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 38 వార్డులను ఎనిమిది జోన్‌లుగా విభజించి పను లు నిర్వహిస్తున్నారు. చెత్త సేకరించేందుకు కో ట్లాది రూపాయలు వెచ్చించి 24 ఆటోలు, ఏడు ట్రాక్టర్లు, ఒక స్వీపింగ్ మిషన్‌ను కొనుగోలు చే శారు. 38 వార్డుల్లో నుంచి ప్రతి రోజూ 35 మె ట్రిక్ టన్నుల చెత్త సేకరించాల్సి ఉండగా గడిచి న 4 నెలలుగా 50 శాతం చెత్తను మాత్రమే సేకరిస్తున్నారు. మొత్తం 24 ఆట్లో నుంచి 10 మాత్రమే పనిచేస్తుండగా 14 మూలనపడ్డాయి. స్వీపింగ్ మిషన్ సైతం పని చేయడం లేదు.
అదనపు కలెక్టర్ వచ్చినా..
గత 10 రోజుల క్రితం అదనపు జిల్లా కలెక్టర్ అంకిత్ బోధన్ బల్దియాను సందర్శించారు. పారిశుధ్య నిర్వహణపై ఆరా తీశారు. మున్సిపల్ వాహనాల కండీషన్, మరమ్మతులకు సంబంధించి నివేదిక అందించాలని కమిషనర్‌ను ఆదేశించారు.
బోధన్‌లో అస్తవ్యస్తంగా
పారిశుధ్య నిర్వహణ
రెండు, మూడు రోజులకోసారి
చెత్త సేకరణ
Comments
Please login to add a commentAdd a comment