నెలకు రూ.20లక్షలకు పైగా..
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణకు ఉపయోగించే వాహనాలు, వాటి నిర్వహణ బల్దియాకు భారంగా మారింది. కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజూ 300 మెట్రిక్ టన్నుల చెత్త జమవుతున్నాయి. చేత సేకరణకు మొత్తం 137 వాహనాలు ఉండగా, వాటిలో 68 టాటా ఏస్‌లు, 34 ట్రాక్టర్లు, తొమ్మిది ఐచర్లు, మూడు కంప్రెషర్‌లు, మరో మూడు స్వీపింగ్ మిషన్లు ఉన్నాయి. మిగతా 20 వాహనాలను స్క్రాప్‌కు పంపించాలని ఆర్టీఏ అధికారులు బల్దియాకు నోటీసులు ఇచ్చారు. పలు కాలనీలకు మున్సిపల్ వాహనాలు వెళ్లకపోవడంతో చెత్త పేరుకుపోతోంది.
తలకు మించిన భారం.. పెద్ద వాహనాలు
బల్దియాకు 12 పెద్ద వాహనాలు ఉన్నాయి. కోట్లా ది రూపాయలు వెచ్చించి వాటిని కొనుగోలు చేశా రు. వాటి ద్వారా చేసే పనులతో పోలిస్తే డీజిల్ మెయింటెనెన్స్ తడిసిమోపెడవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రూ.లక్షల్లో ఖర్చు
గత పాలకవర్గం కమీషన్ల కోసం బల్దియాకు నాసిరకం వాహనాలు కొనుగోలు చేసిందనే చర్చ విస్తృతంగా సాగింది. ఈ అవకాశాన్ని అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వా టి మరమ్మతులు, నిర్వహణ పేరుతో లక్షలాది రూ పాయలు బిల్లులు చేస్తున్నారు. ప్రతినెలా రూ.20లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.
వాహనాల కొనుగోలు లేనట్లే..
శానిటేషన్‌కోసం వినియోగించే వాహనాలు తరచూ రిపేర్‌కు వస్తున్నాయి. వెంటనే రిపేర్లు చేయించకుండా జాప్యం చేస్తే చెత్త తరలింపు ఆలస్యమవుతుంది. ఇప్పటికే కొన్ని వాహనాలు మూలనపడ్డాయి. ఇప్పట్లో కొత్త వాహనాల కొనుగోలు లేనట్లే.
– సాల్మన్ రాజు, మున్సిపల్ వెహికిల్స్ ఇన్‌చార్జి
తరచూ మరమ్మతులు
అనుభవం ఉన్న డ్రైవర్లు, మంచి రోడ్లున్నప్పటికీ చెత్త సేకరణ వాహనాలు తరచూ రిపేర్లకు వెళ్తున్నాయి. రిపేర్ల పేరుతో ప్రతినెలా భారీగా బిల్లులు పెడుతున్నారు. వాటిని పరిశీలించకుండానే బిల్లులు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాహనాల మరమ్మతుల పేరుతో పెద్ద ఎత్తున నిధులు దారి మళ్లుతున్నాయని పలువురు ప్రజాప్రతినిధులు, సిబ్బంది వాపోతున్నారు. గత కొన్నేళ్లుగా తతంగం కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment