డీపీవోగా శ్రీనివాస్‌రావు బాధ్యతల స్వీకరణ
సుభాష్‌నగర్: జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా శ్రీనివాస్‌రావు సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. గతంలోనే శ్రీనివాస్‌రా వు బదిలీ ఉత్తర్వులు వెలువడినప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఇన్‌చార్జి డీపీవోగా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీనివాస్ నిజామాబాద్ డీఎల్‌పీవోగా కొనసాగనున్నారు. అలాగే బోధన్ డీఎల్‌పీవోగా నాగరాజు బాధ్యతలు చేపట్టారు. ఆయన బాన్సువాడ నుంచి బోధన్‌కు బదిలీపై వచ్చారు.
13 నుంచి రైల్వే గేటు మూసివేత
నవీపేట: మండలంలోని ధర్మారం(ఏ) రైల్వే గేటును ఈనెల 13 నుంచి మూసివేయనున్న ట్లు రైల్వే ఇంజినీర్ రవి ప్రకాశ్ సోమవారం తెలిపారు. అండర్ బ్రిడ్జి నిర్మా ణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో గేటును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పేర్కొన్నా రు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.
అల్జాపూర్ శివారులో చిరుత సంచారం
నవీపేట: మండలంలోని అల్జాపూర్–యంచ గ్రామాల మధ్య చెరువు కట్టపై సోమవారం చిరుత కనిపించడంతో రెండు గ్రామాల ప్ర జలు భయాందోళనకు గురవుతున్నారు. రైతులకు చిరుత కనిపించడంతో వెంటనే పారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. నిజామాబాద్ బీట్ ఆఫీసర్ సుధీర్, సెక్షన్ ఆఫీసర్ జెహ్రూ చెరువు ప్రాంతంలో పర్యటించి ఆనవాళ్లను సేకరించారు. పాదముద్రలు చిరుతవేనని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
సీఐల బదిలీలు
ఖలీల్‌వాడి: మల్టీ జోన్–1 పరిధిలో 114 మంది సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐజీకి అటాచ్‌గా ఉన్న రవికుమార్‌ను సీసీఎస్ నిజామాబాద్‌కు, జి.వెంకటయ్య పీసీఆర్ కామారెడ్డి నుంచి ఎన్‌ఐపీ నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. కాగా, రెండు, మూడు రోజుల్లో కొత్త సీఐలు బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇంటర్ పరీక్షలకు
417 మంది గైర్హాజరు
నిజామాబాద్‌అర్బన్: ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగినట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. మొత్తం 16,297 మంది విద్యార్థులకు 15,880 మంది హాజరుకాగా, 417 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. ఇంటర్ బోర్డు ప రీక్షల విభాగం నుంచి విశ్వేశ్వర్ బృందం ప లు సెంటర్లను తనిఖీ చేసి సమీక్షించింది.
ధర్మపురి జాతరకు
ప్రత్యేక బస్సులు
● మహిళలకు ఉచిత ప్రయాణం
ఆర్మూర్‌టౌన్: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ధర్మపురి జాతరను పురస్కరించుకొని టీజీఎస్ ఆర్టీసీ ఆర్మూర్ డిపో నుంచి ప్రత్యేక బ స్సులను నడుపుతున్నట్లు మేనేజర్ రవీందర్ తెలిపారు. ఈ నెల 11 నుంచి 15 వరకు ఆ ర్మూర్ నుంచి ధర్మపురికి ప్రత్యేక రవాణా ఏ ర్పాట్లు చేశామన్నారు. మహిళలకు ఉచిత ప్ర యాణమని, పురుషులకు రూ. 220, పిల్లల కు రూ.120 టికెట్ ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment