పరిశోధనలతోనే విప్లవాత్మక మార్పులు
తెయూ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు
తెయూ(డిచ్‌పల్లి): యూనివర్సిటీల్లో క్షేత్రస్థాయి పరిశోధనలే సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని తెలంగాణ యూనివర్సిటీ వీసీ టి యాదగిరిరావు పేర్కొన్నారు. తెయూ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో ‘పరిశోధన పత్రాల తయారీ’ అనే అంశంపై నిర్వహించిన ఒక రోజు వర్క్‌షాప్ కార్యక్రమానికి వీసీ హాజరై మాట్లాడారు. యువత నూతన వినూత్న మార్పుల కనుగుణంగా పరిశోధనలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీలు పరిశోధనలకు కేంద్రంగా వర్ధిల్లుతాయన్నారు. రిజిస్ట్రార్ ఎం యాదగిరి మాట్లాడుతూ.. సామాజిక శాస్త్రాలలో సమాజమే ప్రయోగశాలగా భావించి విద్యార్థులు పరిశోధనలు చేయాలన్నారు. ఇలాంటి వర్క్‌షాప్‌లతో ఉత్తమ పరిశోధన పత్రాల తయారీపై అవగాహన కలుగుతుందన్నారు. కార్యక్రమంలో మేనేజ్‌మెంట్ విభాగాధిపతి, వర్క్‌షాప్ కన్వీనర్ ఆంజనేయులు, ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, కై సర్ మహమ్మద్, అపర్ణ, రాజేశ్వరి, వాణి, కిరణ్ రాథోడ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment