మెనూ ప్రకారం భోజనం అందించాలి
బాల్కొండ: విద్యార్థలకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. మంగళవారం మెండోరా మండలం పోచంపాడ్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల కోసం వండిన అన్నంను, కూరలను పరిశీలించారు. స్టాక్ రూంలో నిల్వ ఉంచిన బియ్యం, పప్పుల నాణ్యతను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో నిలిచిపోయిన తరగతి గదుల నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు పోచంపాడ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. మందుల స్టాక్ ను పరిశీలించారు. ఆయన వెంట సాంఘిక సంక్షేమ పాఠశాలల జోనల్ ఇన్‌చార్జి పూర్ణచందర్, తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, వైద్యాధికారి రాకేశ్, ిప్రిన్సిపాల్ గోదావరి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment