ఖలీల్‌వాడి: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిజామాబాద్ జిల్లా యువకులను మోసం చేసిన ముగ్గురు ఏజెంట్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్‌రావు మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాకు చెందిన అలకుంట సంపత్, జగిత్యాల జిల్లాకు చెందిన దండుగుల చిరంజీవి, మిట్టపల్లి నర్సారెడ్డిలు థాయిలాండ్, లావోస్ దేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి జిల్లాకు చెందిన బాధితుల నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేశారు. వీరిని లావోస్ దేశంలో బంధించి సైబర్ నేరాలు చేయించారు. చివరికి ఇద్దరు బాధితులు భారతీయ రాయబార కార్యాలయం సహాయంతో స్వదేశానికి తిరిగి వచ్చి ఏజెంట్లపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏజెంట్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల జ్యుడీ షియల్ రిమాండ్ విధించారు. వీరిని సారంగాపూర్ జిల్లా జైలుకు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment