ఎడపల్లి: జానకంపేట శివారులోని అలీసాగర్ ఎత్తిపోతల కాలువలో గుర్తు తెలియని వ్యక్తి (40) మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం లిఫ్ట్ పంప్ హౌస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కాలువ నుంచి ఈతగాళ్ల సాయంతో బయటకు తీయించారు. మృతదేమం పూర్తిగా కుళ్లిపోయిందని, ఒంటిపై ఎలాంటి గాయాలు లేవన్నారు. లిఫ్ట్ ఉద్యోగుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
అవమానించాడని
స్నేహితుడిపై కత్తితో దాడి
ఖలీల్‌వాడి: తనతో పాటు కుమారులను అవమానించడనే కోపంతో ఓ తండ్రి స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన ఘటన నగరంలోని గాజులపేట్‌లో చేసుకుంది. రెండో టౌన్ ఎస్సై యాసిన్ అరాఫత్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. గాజులపేట్‌కు చెందిన మహేశ్, సంతోష్ ఇద్దరు స్నేహితులు. వీరు ఓ చోట మద్యం సేవించి ఇరుకుటుంబాల గురించి చర్చించుకున్నారు. ఈ క్రమంలో సంతోష్ కుమారులకు నత్తి ఉందని మహేశ్ అనడంతో గొడవ జరిగింది. దీంతో సంతోష్ తనను, తన కుమారులను అవమానించాడనే కోపంతో ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి మహేశ్‌పై దాడి చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
బైక్ చోరీ
ఖలీల్‌వాడి: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్ద పార్క్ చేసిన బైక్ చోరీకి గురైనట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి మంగళవారం తెలిపారు. నగరంలోని ముస్తాయిపురాకు చెందిన షేక్ అహ్మద్ బస్టాండ్ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంకు బైక్‌పై వచ్చాడు. బైక్ పార్క్ చేసి ఏటీఎం లోపలికి వెళ్లి వచ్చే సరికి బైక్ చోరీకి గురైందన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేఇ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment