సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌పై అట్రాసిటీ కేసు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ పోలీస్‌కమిషనరేట్ పరి ధిలోని డిచ్‌పల్లి సీఐ మల్లేశ్, జక్రాన్‌పల్లి ఎస్సై తిరుపతి, కానిస్టేబుల్ మహేందర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని హైకోర్టు, ఎస్సీ, ఎస్టీ కమిషనర్, జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాలిలా ఉన్నాయి..
జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన రావుట్ల అలియాస్ రాగుట్ల నచ్చన్నకు సర్వే నంబర్ 197/ఆలో ఎకరం భూమి ఉంది. ఈ భూమిలో వడ్డెర కులానికి చెందిన పలువురు దేవుడి ప్రతిమను ఏర్పాటు చేసి షెడ్డు నిర్మాణం చేపట్టారు. నచ్చన్న పని నిమిత్తం భూమి వద్దకు వెళ్లగా అక్కడ షెడ్డు నిర్మించి ఉన్నట్లు గుర్తించి తనకు తెలిసిన వారికి, కులస్తులకు సమాచారం అందించి అక్కడికి వెళ్లారు. షెడ్డు నిర్మాణం ఎలా చేపట్టారని నచ్చన్న తరఫున వారు ప్రశ్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నచ్చన్నతోపాటు ఆయన తరఫున వచ్చిన కులస్తులు జక్రాన్‌పల్లి పీఎస్‌కు వెళ్లి ఎస్సై తిరుపతికి ఫిర్యాదు చేశారు. ఎస్సై తిరుపతికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో డిచ్‌పల్లి సీఐ మల్లేశ్‌కు ఫిర్యాదు చేసి మళ్లీ భూమి వద్దకు వెళ్లారు. భూమిలో పంట వేస్తుండగా జక్రాన్‌పల్లి పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్ మహేందర్ అక్కడికి చేరుకుని పనులు నిలిపివేయాలని నచ్చన్నతోపాటు మహిళలు, కులస్తులను హెచ్చరిస్తూ మహిళలను అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టును నచ్చన్న ఆశ్రయించారు. గతేడాది డిసెంబర్ 2న డిచ్‌పల్లి సీఐ మల్లేశ్‌తోపాటు ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమో దు చేయాలని స్పెషల్ జడ్జి, ఎస్సీ, ఎస్టీ యాక్ట్, డిస్ట్రిక్ట్ అడిషనల్–2 జడ్జి టి శ్రీనివాస్ తీర్పు వెలువరించి ఇన్‌చార్జి సీపీ సింధుశర్మకు పంపించారు. కానీ రెండు నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసు కోకపోవడంతో దీనిపై నచ్చన్న ఈ ఏడాది జనవరి 24న హైదరాబాద్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, డిచ్‌పల్లి సీఐ మల్లేశ్, జక్రాన్‌పల్లి ఎస్సై తిరుపతితోపాటు కానిస్టేబుల్ మహేందర్ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకువాలని ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిషన్ అట్రాసిటీ కేసు నమోదు చేసి దీనికి సంబంధించిన నివేదిక 30 రోజుల్లో అందించాలని గత నెల 4న కలెక్టర్, సీపీ, జక్రాన్‌పల్లి తహసీల్దార్, జక్రాన్‌పల్లి పీఎస్ ఎస్సై తిరుపతికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ సెక్రెటరీ జీఎస్ పాండాదాస్ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ 24న జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను అమలు చేయకపోవడంతో గత నెల 27న బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా, సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి, భూమిలోని షెడ్డును తొలగించి బాధితుడికి అప్పగించాలని హైకోర్టు జస్టిస్ బి విజయసేన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు కేసు నమోదు చేయకపోవడానికి గల కారణాలపై హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, పోలీస్‌కమిషనర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వులు వచ్చినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. భూమిలో ఉన్న దానిని తొలిగించకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేయకుండా స్థానికంగా ఒత్తిడితోనే ఈ భూమి వ్యవహారం వివాదంగా మా రుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మునిపల్లిలోని ఓ భూవివాదంలో
డిచ్‌పల్లి సీఐ, జక్రాన్‌పల్లి ఎస్సై, కానిస్టేబుల్‌పై..
హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీపీలు విచారణ జరపాలి
ఉత్తర్వులు జారీ చేసిన
హైకోర్టు జస్టిస్ బి విజయసేన్‌రెడ్డి
పోలీసులు పట్టించుకోలేదు
నా భూమిలో దేవుడి ప్రతిమ లు పెట్టి షెడ్డు నిర్మించారు. ఈ విషయమై పోలీసులకు ఫి ర్యా దు చేస్తే పట్టించుకోలేదు. దీంతో కోర్టుకు వెళ్లాను. పోలీసుల పై చర్యలు తీసుకోవాలి. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆ భూమిని నాకు అందించాలి.
– నచ్చన్న, మునిపల్లి, జక్రాన్‌పల్లి
సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌పై అట్రాసిటీ కేసు
Comments
Please login to add a commentAdd a comment