చికిత్స పొందుతూ యువకుడి మృతి
తాడ్వాయి: పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామానికి చెందిన బంగారుగల్ల అభిజిత్(24) అనే యువకుడు చిన్న నాటి నుంచి అమ్మమ్మ శాంతవ్వ వద్ద పెరుగుతున్నాడు. పనిచేసుకుంటు బతకాలని అభిజిత్‌ను అమ్మమ్మ బెదిరించడంతో ఈ నెల 1న పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
గుంటి తండాలో పునాదులు ధ్వంసం
మాచారెడ్డి: తాతల నాటి నుంచి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ గిరిజన రైతు అక్కడ ఇంటి నిర్మాణం కోసం తీసిన పునాదులను మంగళవారం అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. వివరాలిలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం గుంటి తండాకు చెందిన లకావత్ లచ్చిరాం కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తూ కుటుంబంతో గుడిసెలో నివాసం ఉంటున్నాడు. గుడిసెను తొలగించి ఇల్లు కట్టుకోవాలని ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే మెటీరియల్ తెప్పించుకొని పునాదులు తవ్వించాడు. అటవీ శాఖ అధికారులు మంగళవారం పొక్లెయిన్‌తో పునాదులను ధ్వంసం చేశారు. ఈ విషయమై మాచారెడ్డి ఎఫ్‌ఆర్వో దివ్యను వివరణ కోరగా అటవీ స్థలంలో ఇల్లు నిర్మిస్తున్నారన్న సమాచారం మేరకు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా ఇంటి నిర్మాణ పనులు చేపట్టారని, ఉన్నతాధికారుల ఆదేశాలతో అటవీ స్థలంలో నిర్మిస్తున్న ఇంటి పునాదులను ధ్వంసం చేసినట్లు తెలిపారు.
కుక్కల దాడిలో 11 గొర్రెలు మృతి
మోపాల్: మండలంలోని కులాస్‌పూర్ తండాలో కుక్కల గుంపు దాడి చేయడంతో చందర్‌కు చెందిన 11 గొర్రెలు మంగళవారం మృతిచెందాయి. వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన చందర్ 18 గొర్రెలను ఇంటి ఆవరణలోనే పెంచుతున్నాడు. రోజులాగే పొలానికి నీరు పెట్టేందుకు మధ్యాహ్నం వెళ్లాడు. కుక్కల గుంపు ఒక్కసారిగా గొర్రెలపై దాడి చేయడంతో 11 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల మృతితో సుమారు రూ.లక్ష వరకు నష్టం జరిగిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు చందర్ కోరారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
చికిత్స పొందుతూ యువకుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment