నిధులు కేటాయించారు.. నిర్మాణాలు మరిచారు
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలో వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం మోర్తాడ్, కుద్వాన్‌పూర్, ఆర్మూర్, ఎడపల్లి, బోధన్, శ్రీరాంపూర్, చీమన్‌పల్లి, నిజామాబాద్‌లలో బాలబాలికలకు వేర్వేరుగా మహాత్మా జ్యోతీబా ఫూలే గురుకులాలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం నియోజకవర్గానికి బా లుర కోసం ఒకటి, బాలికల కోసం మరో విద్యా సంస్థలను ప్రారంభించింది. ఒక్కో గురుకులంలో 400 నుంచి 500 మంది వరకు పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు. సొంత భవనాలను నిర్మించేందుకు 2024–25 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,546 కోట్లు కేటాయించింది. మరికొద్ది రోజుల్లో 2025–26 బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అయినప్పటికీ బీసీ గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడం గమనార్హం.
కొన్ని చోట్లే ఇంటర్ విద్య..
పేరుకే అన్ని గురుకులాల్లో ఇంటర్ విద్య అందిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మా త్రం ఒకటి, రెండు చోట్లనే కొనసాగుతున్నాయి. ఇంటర్ విద్యను ఆరంభించిన తర్వాత గదుల కొరతతో కేవలం కంజర కళాశాలలోనే విద్యార్థులకు చదువు చెబుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికై నా సొంత భవనాల కల నెరవేరుతుందని అంతా ఆశించినా.. ఇప్పటి వరకు ఎక్కడ కూడా స్థల సేకరణ జరగకపోవడంతో కలగానే మిగిలిపోయింది.
ఇరుకుగదుల్లోనే..
బీసీ గురుకులాల విద్యార్థులు అనువైన భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకు గదుల్లోనే వందలాది మంది విద్యార్థులకు వసతి, విద్యాబోధన ఇబ్బందిగా మారింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పాఠశాల, కళాశాలలకు సొంత భవనాలను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అద్దె భవనాల్లోనే బీసీ గురుకులాలు
2024–25 బడ్జెట్‌లో సొంత భవనాల కోసం నిధుల కేటాయింపు
Comments
Please login to add a commentAdd a comment